కోట్లాది మంది ఫేవరేట్ స్టార్ సింగర్ బయోపిక్ లో సాయి పల్లవి..నేషనల్ అవార్డ్ కన్ఫామ్..!?

Thota Jaya Madhuri
సహజమైన నటనకు మారుపేరుగా నిలిచిన అందాల భామ సాయి పల్లవి, తన ప్రతి పాత్రతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. గ్లామర్‌కు దూరంగా, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న ఆమె, నేటి తరం నటీమణుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సాయి పల్లవి ఒక సినిమాకు ఓకే చెప్పిందంటే, ఆ సినిమాపై ఆటోమేటిక్‌గా మంచి బజ్ క్రియేట్ అవడం విశేషం.ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ లో సీతాదేవి పాత్రలో నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. సీత పాత్రకు సాయి పల్లవి ఎంపిక కావడం పట్ల అభిమానులు భారీగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



ఇదిలా ఉండగా, తాజాగా సాయి పల్లవి మరో అత్యంత కీలకమైన పాత్రలో నటించబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. లెజెండరీ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతీయ శాస్త్రీయ సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న బయోపిక్‌లో సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషించనున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌కు ‘జెర్సీ’ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



భారత సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, భారతరత్న పురస్కారం అందుకున్న తొలి సంగీత కళాకారిణిగా చరిత్ర సృష్టించారు. ఆమె సంగీత సాధన, భక్తి రసంతో నిండిన కీర్తనలు, దేశ విదేశాల్లో ఆమెకు వచ్చిన గౌరవాలు, అపారమైన కీర్తి ప్రతిష్టలు ఈ బయోపిక్‌లో ప్రధానంగా చూపించనున్నట్లు సమాచారం. ఇటువంటి గొప్ప పాత్రకు సాయి పల్లవి లాంటి సహజ నటన ఉన్న నటీమణి అయితే పూర్తి న్యాయం చేయగలరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.గతంలో ఈ బయోపిక్‌లో ప్రముఖ నటి విద్యా బాలన్ నటిస్తారనే వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. అప్పట్లో ప్రసిద్ధ కాస్ట్యూమ్ డిజైనర్ అను పార్థసారథితో కలిసి విద్యా బాలన్ ప్రత్యేక ఫోటోషూట్ కూడా చేశారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఇప్పుడు కొత్తగా సాయి పల్లవి పేరు వినిపించడం ఆసక్తికరంగా మారింది.



ఒకవేళ ఈ బయోపిక్‌లో సాయి పల్లవి నిజంగానే నటిస్తే, అది ఆమె కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. నేషనల్ అవార్డ్ కూడా అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంగీత ప్రధానమైన పాత్ర, భావోద్వేగాలున్న కథ, జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే సినిమా కావడంతో అవార్డుల పరంగా కూడా ఈ చిత్రానికి మంచి అవకాశాలు ఉంటాయని చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పటి నుంచే “నేషనల్ అవార్డ్ ఖాయం” అనే టాక్ కూడా వినిపిస్తోంది.మరి నిజంగా సాయి పల్లవి ఈ లెజెండరీ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటిస్తుందా? ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: