ఈరోజు నుంచే ధనుర్మాసం ప్రారంభం..30 రోజులు ఎలా చేయాలంటే..?

Divya
సూర్యుడు ధనస్సు రాశిలో సవరించే మాసాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు. ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసంగా చెబుతూ ఉంటారు. గోదాదేవి విష్ణు వ్రతం చేపట్టి, స్వామివారిని కీర్తించేది ఈ ధనుర్మాసంలోనే అందుకే ఈ నెలలో దేవాలయాలలో ఎక్కువగా అండళమ్మ పూజ, గోదా కళ్యాణం, తీరుప్పావై పఠనం వంటివి నిర్వహిస్తుంటారు. ఈరోజు నుంచే ఈ ధనుర్మాసం నెల ప్రారంభమవుతుంది. ఈ నెలలో శ్రీవ్రతం ఆచరిస్తే అంతా మంచి జరుగుతుందని పండితులు సైతం తెలియజేస్తున్నారు.


విష్ణువును మధుసూదనుడిగా పూజించి, గోదాదేవి కీర్తనలు ఆలపిస్తూ పూజిస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు కృష్ణుడికి తులసి మాల వేసి ప్రార్థిస్తే వివాహం జరుగుతుందని సూచిస్తున్నారు. శ్రీవ్రతం ఎలా చేయాలనే విషయంపై కొంతమంది పండితులు తెలుపుతున్న ప్రకారం.. ముందుగా విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని తీసుకొని వాటిని శుభ్రం చేసుకోవాలి. ఆ విగ్రహానికి ఆవు పాలు, పంచామృతంతో అభిషేకం చేయాలి. చిత్రపటానికి లేదా గ్రహానికి గంధం కుంకుమ పువ్వు పెట్టాలి.


అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసి, పచ్చ కర్పూరం తో హారతి ఇవ్వాలి.. ఇలా మొదటి 15 రోజులపాటు బియ్యం పెసరపప్పు , మిగిలిన మరో 15 రోజులపాటు దద్దోజనంతో నైవేద్యం పెట్టాలి. అలా చేస్తున్న ప్రతిరోజు కూడా రోజుకొక పాశురాన్ని అలపించాలి. ఈ వ్రతాన్ని నిష్టగా పాటించడం వల్ల విష్ణువుని ప్రసన్నం చేసుకోవచ్చు. 'ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమః' ఓం శ్రీ రంగ నిలయమై నమః' ఈ 30 రోజులపాటు ప్రతిరోజు ఈ రెండు మంత్రాలను పాటించాలని పండితులు సైతం తెలియజేస్తున్నారు. శ్రీవ్రతం ఆచరించే వారే కాకుండా పూజ చేయని వారు కూడా ఈ మంత్రాలను చెప్పవచ్చు. పూజా మందిరంలో కొలువైన విష్ణుమూర్తిని చూస్తూ పూజ చేయడం వల్ల ఆ ఇంటిల్లిపాది సిరిసంపదలు పెరుగుతాయని పండితులు సైతం సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: