టాలీవుడ్ యువ నటుడు నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఓ రెండు సెంటిమెంట్ల ప్రకారం చూసినట్లయితే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని కొంత మంది అంచనా వేస్తున్నారు. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి తో పాటు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్గా నటించింది.
అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తూ ఉండడం , ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనుండడంతో ఒక వేళ మీనాక్షి చౌదరి కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన ఆ రెండు సెంటిమెంట్లు అనగనగా ఒక రాజు సినిమా విషయంలో కూడా వర్కౌట్ అయితే ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు. ఇకపోతే అనగనగా ఒక రాజు సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.