సినీ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ కొడుకు మృతి..?

Divya
కన్నడ సినీ ఇండస్ట్రీలో తాజాగా విషాద ఘటన చోటుచేసుకుంది. మరి కొన్ని రోజులలో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న సినిమా డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ దంపతుల కుమారుడు సోనార్ష్ (నాలుగేళ్ల కుమారుడు) కోల్పోయారు. ఈనెల డిసెంబర్ 15వ తేదీన సోమవారం సోనార్ష్ అనుకోకుండా లిఫ్టులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయారని, ఈ విషయం కీర్తన్ నాదగౌడ కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని నింపింది. ఈ విషయం తెలిసిన పలువురు సినీ వర్గాల వారు కూడా ఈ చిన్నారి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.



కీర్తన్ నాదగౌడ కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం కలదు. పాన్ ఇండియా లెవల్లో విడుదల భారీ విజయాన్ని అందుకున్న కేజిఎఫ్ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆ అనుభవంతోనే త్వరలోనే ఒక బడా ప్రాజెక్టును దర్శకత్వం మొదలుపెట్టారు..అందుకు సంబంధించి ప్రశాంత్ నీల్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు హర్రర్ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలను కూడా ఇటీవలే చాలా గ్రాండ్ గానే చేపట్టారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు.


ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని ఆనందపడే సమయంలోనే  కీర్తన్, సమృద్ధి దంపతులకు కుమారుడు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ విషయం కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర దుఃఖాన్ని నింపింది. ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంతాపాన్ని ప్రకటించారు. పుత్రశోకం నుంచి తేరుకొని మనో ధైర్యాన్ని ఆ దంపతులకు ఇవ్వాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీర్తన్ నాదగౌడ కుమారుడి మరణంతో కొన్ని నెలల పాటు సినిమా షూటింగ్ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: