బాలయ్య ఆఖరి ఐదు మూవీల త్రీ డేస్ రిపోర్ట్ ఇదే.. అలాంటి పరిస్థితుల్లో అఖండ 2..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ఆఖరి ఐదు మూవీలకు మొదటి మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. మొదటి రోజు మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 51.45 కోట్ల షేర్ ... 85.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

బాలకృష్ణ కొంత కాలం క్రితం డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ... బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి మొదటి మూడు రోజుల్లో కలిపి 54.30 కోట్ల షేర్ ... 87.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

బాలకృష్ణ కొంత కాలం క్రితం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరో గా నటించాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కి మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 29.48 కోట్ల షేర్ ... 51.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి.

బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ కి మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 44.50 కోట్ల షేర్ ... 73.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

కొంత కాలం క్రితం బాలకృష్ణ "అఖండ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి మొదటి మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 35.40 కోట్ల షేర్ ... 56.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

అఖండ 2 మూవీ కి మొదటి మూడు రోజుల్లో మంచి కలెక్షన్లే ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కూడా ఈ సినిమా డాకు మహారాజ్ సినిమాకు మొదటి మూడు రోజుల్లో దక్కిన కలెక్షన్లను మాత్రం దాటలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: