వామ్మో.. ఇంత పెద్ద పామా..వీడియో వైరల్..!!
ఈ పాము పొడవు చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు ఇంత పెద్ద పామా అంటూ చూసిన వారికి నిద్ర కూడా పట్టదు. ప్రస్తుతం ఈ పాము కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ పాము.. జార్ఖండ్ ధన్‌బాద్‌లోని ఎఫ్‌సిఐ సింద్రీలో ఉన్న అటవీ ప్రాంతంలో బయటపడిందని వార్తలొచ్చాయి.
సుమారు వంద కిలోల బరువు..6.1 మీటర్ల పొడవున్న ఈ పాము తాజాగా జార్ఖండ్ ధన్‌బాద్‌లో అక్కడ అటవీ అధికారులకు కనిపించింది.ఇకపోతే ఇంతటి బరువైన పామును పైకి లేవడానికి మనుషుల వల్ల కాకపోవడంతో ఏకంగా జేసీబీ సహాయం తీసుకోవాల్సి వచ్చింది..అయితే ఈ విషయాలన్నింటినీ రాజ్యసభ సభ్యుడు పరిమల్ నాథవానీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియోను పోస్ట్ చేశారు.ఇకపోతే ఇటువంటి పాము జార్ఖండ్‌లో ఇప్పటివరకూ కనిపించలేదని, జార్ఖండ్ అధికారులు వెల్లడించారు.
ఇక పైథాన్ పాము డొమినికా అడవిలో బయటపడినట్లు సోషల్ మీడియా అయిన టిక్ టాక్‌లో.. వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియో షేర్ చేయగానే టిక్ టాక్‌లో 79 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం తో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోలో పాము భారీ సైజును చూసి నెటిజన్లంతా ఔరా అంటున్నారు. అంతే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇదేనేమో అని తెగ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా జెసిబి తో పైకి లేప గలిగే అంత బరువైన , పొడవైన పామును ఇప్పటివరకు బహుశా ఎవరో చూసి ఉండరేమో..