వికలాంగుల కోసం 'హోండా' అద్భుతమైన ప్రయోగం?

యాక్సిడెంట్లలో  కాళ్లు కోల్పోయిన, పుట్టుకనుంచే ఏదైనా అంగవైకల్యం ఉన్న అలాంటి వాళ్లకు వీల్ చైర్ అనేది చాలా తప్పనిసరి. అయితే మొదట్లో ఒక మనిషి సహాయంతోనే వీల్ చైర్ లో కదిలే అవకాశం ఉండేది.అయితే ఆ తర్వాత రోజుల్లో సొంతంగా మాన్యువల్ గా కదిలించుకునే స్థితి నుంచి ఇప్పుడు బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అసలు ఎవరి సహాయం లేకుండానే ఎక్కడికైనా వెళ్లగలిగేలా ఈ వీల్ చైర్లను తయారు చేస్తున్నారు.ఇప్పుడు వీటన్నింటినీ దాటుకొని ఇంకా సూపర్ టెక్నాలజీతో హోండా కంపెనీ మరో వీల్ చైర్ ను తయారు చేసింది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో హోండా కంపెనీ టాప్ ఫైవ్ కంపెనీలో ఒకటి. హోండా టూ వీలర్స్, హోండా కార్లు గురించి అందరికీ తెలిసిందే.మొదటిసారిగా హోండా చాలా పరిశోధన చేసి వికలాంగుల కోసం  హోండా యూని వన్ పేరుతో దీన్ని తయారు చేసింది. ఈ యూని వన్ కేవలం నడవలేని వాళ్లకు మాత్రమే కాదు. నడుము కదిలించలేని వాళ్ళకి ఇంకా వెన్నుముక విరిగిన వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఇది మామూలు వీల్ చైర్లులా కాకుండా యూని వన్ లో హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది.


పైగా ఈ వీల్ చైర్ లో వెళ్తున్నప్పుడు అసలు సాధారణ మనిషి నడుస్తుంటే ఎలా ఉంటారో అలాంటి సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు.ఇంకా అంతేకాదు దీని ఆపరేటింగ్ అంతా వీల్ చైర్ లో కూర్చున్న వ్యక్తి కనుసైగలను బట్టి ఉంటుంది. బాడీ మూమెంట్ ద్వారా కూడా యూని వన్ లో ఏ పక్కకు కావాలంటే ఆ పక్కకు ప్రయాణం చేయవచ్చు. చేతులను  కదిలించే విధంగా వీల్ చైర్ కు ఎలాంటి మన్యువల్ ఆపరేటింగ్ సిస్టం ఇవ్వలేదు. ఇక ఇది పూర్తిగా బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్. దీన్ని ఒక్కసారి చాట్ చేస్తే కొన్ని రోజులపాటు వీల్ చైర్ పనిచేస్తుంది.మొత్తం నాలుగు చక్రాలను యూని వన్ కు బిగించారు. ఇవి పూర్తిగా హట్ డ్రైవ్ సిస్టం ద్వారా పనిచేస్తాయి. పైగా ఈ చక్రాలు ఎక్కడ బయటకు కనిపించవు.ఇంకా వృద్ధులు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా  దీనికి ఒక జాయ్ స్టిక్ ని కూడా అమర్చుకునే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏర్పాటు చేసింది. ఈ యూనివన్ సహాయంతో వ్యక్తులు సాధారణ మనుషులు చేసే ఉద్యోగాలు కూడా ఈజీగా చేయొచ్చని చెప్తుంది హోండా కంపెనీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: