వాట్సాప్ నెంబర్ మార్చాలా.. చాట్ డిలీట్ కాకుండా ఇలా చేయండి?

praveen
నేటి రోజుల్లో వాట్సాప్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ లేని వ్యక్తి లేడు అన్నది ఎంత నిజమో వాట్సాప్ వాడని వ్యక్తి లేడు అనేది కూడా అంతే నిజం అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు.. ఇక నేటి రోజుల్లో ఎలాంటి సందేశం పంపాలన్నా వాట్సాప్ అందరికీ మొదటి ఆప్షన్ గా మారిపోయింది. మరోవైపు వాట్సాప్ సంస్థ కూడా తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు వినూత్న ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది.

 అయితే ప్రస్తుతం వాట్సప్ వాడుతున్న వినియోగదారులందరికీ తెలియని ఎన్నో ఫీచర్లు వాట్సాప్ లో దాగి ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటి వాటిలో చేంజ్ నెంబర్ అని ఒక ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ లో అందుబాటులో ఉన్న ఇక ఈ ఫీచర్ ను ఉపయోగించుకొని తమ ప్రైమరీ నెంబర్ ను వేరొక నెంబర్ వాట్సప్ అకౌంట్ కూడా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ అకౌంట్ నెంబర్ మార్చడం వల్ల చాట్స్ కూడా డిలీట్ కావు అని చెప్పాలి. కానీ ఇక వాట్సప్ అకౌంట్ నెంబర్ మార్చే సమయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది

 ముందుగా మీరు మార్చాలి అనుకుంటున్నా నెంబర్ వర్కింగ్ లో ఉందో లేదో తెలుసుకోవాలి ఎందుకంటే. ఆ నెంబర్కు కాల్స్ మెసేజ్లు లాంటివి వస్తేనే నెంబర్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ కొత్త మొబైల్ కు వాట్సాప్ మార్చాలి అనుకుంటే ఈ ఫీచర్ వర్క్ చెయ్యదు అని గుర్తుంచుకోవాలి. ఇకపోతే వాట్సాప్ లో చాట్స్ కోల్పోకుండా నెంబర్ మార్చడం ఎలాగో ఇప్పుడు  నేర్చుకుందాం
1. ముందుగా మీ మొబైల్ లో  వాట్సాప్ ఓపెన్ చేయాలి.
2. సెట్టింగ్స్ లోకి వెళ్లి.. ఆ తర్వాత  అకౌంట్ అనే ఆప్షన్  పై క్లిక్ చేయండి.
3. చేంజ్ నంబర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్  బటన్ పై క్లిక్ చేయాలి.
4. ఇప్పుడు మీరు మీ పాత వాట్సాప్ నంబర్, మార్చాలి అనుకుంటున్నా కొత్త  వాట్సాప్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్  పై క్లిక్ చేయండి.
5. మీరు మీ వాట్సాప్ అకౌంట్‌ను మారుతున్నట్లు మీ కాంటాక్ట్స్‌కు తెలియ  చెయ్యాలా వద్దా అని వాట్సాప్ మిమ్మల్ని అడుగుతుంది .
6. అప్పుడు మీరు ఆల్ కాంటాక్ట్స్, కాంటాక్ట్స్ ఐ హావ్ చాట్ విత్  లేదా కస్టమ్ అనే మూడు ఆప్షన్లలో దేన్నైనా ఎంచుకునేందుకు  అవకాశం ఉంటుంది .
7. ఇప్పుడు డన్  పై క్లిక్ చేయండి.
8. ఇప్పుడు వాట్సాప్ కొత్త మొబైల్ నంబర్‌తో అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అడుగుతుంది. ఇక కొత్త నెంబర్ కు వచ్చిన  ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
9. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీ వాట్సాప్ నెంబర్ మారిపోతుంది . అంతేకాకుండా మీ వాట్సాప్ పాత చాట్స్ డిలీట్ అవ్వకుండా ఎప్పట్లాగానే యథావిధిగా కనిపిస్తాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: