టీవీ: క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వాక్యాలు చేసిన బ్రహ్మముడి సీరియల్ నటి..!!

Divya
బెంగాలీ అమ్మాయిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నైనిషా రామ్. తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మముడి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.. ఆ తర్వాత వరుసగా పలు సీరియల్స్ లో నటించిన ఈ నటి ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేస్తూ కుటుంబానికి కూడా దూరమైన విషయాన్ని తాజాగా నైనిషా ఈ ఇంటర్వ్యూలో తెలియజేసింది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నైనిషా రామ్ మాట్లాడుతూ నటన పైన ఆసక్తి ఉండడంతో కుటుంబానికి దూరమయ్యానని బెంగాలీ కుటుంబానికి చెందిన తన తండ్రి లెక్చరర్ అని తల్లి హౌస్ వైఫ్ అంటూ తెలిపింది. వాళ్ళకి ఇండస్ట్రీలోకి రావడం అసలు ఇష్టం లేదని.. దీంతో కుటుంబాన్ని వదిలేసి ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేశాను అంటూ తెలిపింది. అలా బ్రహ్మముడి అనే సీరియల్స్ లో అప్పు పాత్రలు నటించడం తనకు బాగా కలిసి వచ్చిందని ఆ తర్వాత కలిసి ఉంటే కలదు సుఖం, భాగ్యరేఖ, శ్రీమంతుడు, వంటలక్క తదితర సీరియల్స్ లో నటించాను అంటూ తెలిపింది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం వల్లే తన తల్లిదండ్రులు తనకు దూరమయ్యారని తెలిపింది నైనిషా రామ్.. అయితే ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.. ఏదైనా ప్రాజెక్టు విషయంలో రెండు మూడు రోజులు షూటింగ్ అనగా మేనేజర్ కమిట్మెంట్ ఇవ్వవలసి ఉంటుందని తన తో కూడా చాలా మంది అలాగే చెప్పారని తెలిపింద.. తను కుదరదు అన్నందుకు తనని చాలా మంది ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని తన పరిస్థితి చాలా దారుణంగా మారిపోయి చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు కూడా తనలో వచ్చాయని తెలిపింది. ఆఖరికి తినడానికి డబ్బులు లేక బ్లడ్ డొనేట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో కడుపు నింపుకున్నానని నైనిషా రామ్ తెలియజేసింది ఈ విషయం విన్న అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: