టీవీ: మనసంతా నువ్వే సీరియల్ సింధు రియల్ లైఫ్ స్టోరీ..!!
ఇకపోతే ఈ సీరియల్ లో సింధు పాత్రలో నటిస్తున్న అమ్మాయి ప్రేమను గెలిపించడానికి చేసే ప్రయత్నం ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.. ఇక పోతే ఈ అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అని విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. సింధు యొక్క రియల్ లైఫ్ స్టోరీ ఏమిటి..? ఆమె వ్యక్తిగత విషయాలు ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
సింధు అసలు పేరు వింధూజా విక్రమన్.. 1993వ సంవత్సరం జనవరి 27వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో ఒక మలయాళం కుటుంబంలో జన్మించింది ఇక వీరి తల్లిదండ్రులు బిందు.. విక్రమన్ నాయర్.. విక్రమ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక ఈమె విద్యాభ్యాసం విషయానికొస్తే.. తిరువనంతపురంలోని కొడుంగర్ అనే గ్రామంలో భారతీయ విద్యా భవన్ లో స్కూల్ విద్య పూర్తిచేశారు. వింధూజా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత మోడల్ గా నటిగా మారింది.
2015 లో మొదటిసారి బ్యాంక్ బెంచర్స్ అనే కామెడీ షో ద్వారా తన టీవీ కెరియర్ ను మొదలు పెట్టింది. ఆ తర్వాత మరెన్నో మలయాళం సీరియల్స్ లో నటించి తెలుగు లో పౌర్ణమి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం మనసంతా నువ్వే సీరియల్ లో నటిస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.