“స్టంప్స్” లో ధోనీ...“ప్రపంచ రికార్డ్”

Bhavannarayana Nch

ధోనీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అతడికే సొంతం చిన్నపిల్లలతో చిన్న వాడిలా వృత్తిలో భాద్యతగా ఆటలో ప్రేమని ఇలా అన్ని రంగాలలో అన్ని విషయాలలో ధోనీ ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటాడు. అందుకే ధోనీ ని ప్రపంచ రికార్దులు సైతం పలకరిస్తూ ఉంటాయి...రికార్డులకి ధోనీ కొత్తేమీ కాదు వికెట్ కీపర్ గా ఎంతో అత్యున్నతమైన ప్రతిభ కనబరిచే ధోనీ ఒక జట్టు కెప్టెన్ గా మరియూ బ్యాట్స్ మెన్ గా కూడా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు..అయితే తాజాగా వికెట్ కీపర్ గా కూడా ధోనీ ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశాడు.

 

మూడు టీ20ల భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై  వికెట్ల తేడాతో  టీంఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్‌ చేసి ఈ విజయంతో తనవంతు పాత్ర పోషించిన వికెట్ కీపర్ ధోనీ ని అరుదైన రికార్డ్ వరించింది..ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జో రూట్‌ను స్టంపౌట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన కీపర్‌గా మహేంద్రుడు ప్రపంచ రికార్డ్‌ సాధించాడు.

 

అయితే పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ పేరిట ఉన్న ఈ రికార్డును “ధోని” అధిగమించాడు..తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 13 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉంది...అయితే ఒక ఓవర్లో మూడో బంతికి ధోని అద్భుతంగా స్టంపింగ్‌ చేయడంతో జానీ బెయిర్‌స్టో (0) ఔటయ్యాడు. ఈ వికెట్‌తో కమ్రాన్‌ అక్మల్‌ (32 వికెట్లు) పేరిట ఉన్న స్టంపౌట్ల రికార్డును ధోనీ  సమం చేశాడు. ఆ మరుసటి బంతికే జో రూట్‌ను ధోని స్టంపౌట్‌ చేసి డకౌట్‌గా పెవిలియన్‌ బాట పట్టించాడు మహీ. దీంతో టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్‌ (33) చేసిన వికెట్‌ కీపరగా ధోని నిలిచాడు. 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: