జగన్ మేనిఫెస్టో.. చెప్పినట్టే చేశాడు?

Chakravarthi Kalyan
ఓట్లు అడిగేటప్పుడు వందల కొద్దీ హామీలు.. గెలిచిన తర్వాత ఆ హామీలను పక్కన పెట్టి దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ఎన్నడూ జరిగేదే. కానీ హిస్టరీని బ్రేక్ చేస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని వైసీపీ గట్టిగా చెబుతోంది. గెలిచిన ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి రికార్డ్ సెట్ చేశామని.. ఢంకా బజాయించి మరీ చెబుతోంది.

మరి ఈసారి అధికార వైసీపీ ఎలాంటి హామీలు ఇవ్వబోతోంది అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ హామీలతో పాటు మరో రెండు కీలక హామీలను ప్రకటించింది. ఇక సీఎం జగన్ కూడా తమ పార్టీ మ్యానిఫెస్టోపై భారీగానే కసరత్తులు చేశారు. ఓ వైపు బస్పు యాత్రలో బిజీబిజీగా గడుపుతూనే మరోవైపు తన ఎన్నికల ప్రణాళికలపై దృష్టి సారించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ మ్యానిఫెస్టో ఎలా ఉండబోతుందో ఒక చిన్న హింట్ కూడా ఇచ్చారు. 2024 ఎన్నికలకు తాను అలివి కానీ హామీలు వాగ్దానాలు ఇవ్వనని చెప్పారు. నన్ను నమ్ముకొని ప్రజలను మోసం చేయనని కూడా పేర్కొన్నారు. చంద్రబాబు మాదిరి మోస పూరిత హామీలు తాను ఇవ్వలేనని చెప్పారు. తాము మ్యానిఫెస్టో పెడితే కచ్చితంగా అమలు చేసేవే చెబుతామని ఘంటాపథంగా చెప్పారు. చంద్రబాబు కి వాగ్ధానాలు ఇవ్వడమే తప్ప అమలు చేయడం రాదని ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఈ సారి మ్యానిఫెస్టోలో మెరుపులు, ఉరుములు ఉండవని ముందే అనిపించింది. అనుకున్నట్టుగానే జగన్‌ తన మేనిఫెస్టోలో 2, 3 పథకాలు తప్ప పెద్దగా ఏమీ హామీలు ఇవ్వలేదు. చెప్పిందే చేస్తామంటూ.. ఉన్న హామీలనే కొనసాగిస్తామని చెప్పకనే చెప్పేశారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి అంత బలంగా వెళ్లకపోయినా.. దానికి తీసిపోని విధంగా వైసీపీ మ్యానిఫెస్టో ఉంటుందనుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. మరి దీన్ని జనం ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: