ఏపీ: షేక్ చేస్తున్న పోల్ సర్వే... కూటమి కుంగిపోక తప్పదా?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నది. ఈ క్రమంలో తాజాగా పోల్స్ గ్రూప్ సంస్థ ఓ సంచలన సర్వే ఒకదానిని విడుదల చేసింది. ఆంధ్రాలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ వెల్లడించింది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఎన్నికలకు దిగినప్పటికీ 8శాతం ఓట్ల తేడాతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని స్పష్టం చేసింది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఎంత శాతం సంతృప్తితో ఉన్నారు, ప్రజల్లో ప్రభుత్వంపై ఎంతశాతం వ్యతిరేకత ఉండనే విషయాన్ని కూడా వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతున్న తరుణంలో పోల్ స్ట్రాటజీ గ్రూప్ విడుదల చేసిన సర్వే వైసీపీకి బూస్ట్ ఇచ్చినట్టు కనబడుతోంది. ఎన్నికలకు రెండంటే రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో వివిధ సర్వే సంస్థలు దూకుడు పెంచాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై సర్వేలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ఈ సర్వే ఫలితాలు విడుదల చేస్తూ ఒక పార్టీకి బూస్ట్ ఇస్తే ఇతర పార్టీలకు వణుకు పుట్టిస్తున్నాయి ఆయా సర్వేలు. ఇకవైపు వైసీపీ తిరిగి అధికారం తమదేనని ధీమాగా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కూటమి గెలుస్తుందని బాబు బలంగా చెప్పుకొస్తున్నారు.
ఇకపోతే వైఎస్ జగన్ పాలనపై రాష్ట్రంలో 56 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని సదరు సర్వేలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 9 శాతం మంది జగన్ సర్కార్ అద్భుతమైన పాలన అందిస్తుందని అభిప్రాయపడ్డారని వెల్లడించింది. మిగిలిన 22శాతం మంది రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని, అంతేకాకుండా 8 శాతం మంది ప్రజలు వైసీపీ పాలన అస్సలు బాగోలేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కాగా 3శాతం మంది ప్రజలు ప్రభుత్వ పని తీరుపై ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇకపోతే టీడీపీ - జనసేన పొత్తుతో ఎన్నికల బరిలో దిగినా.. పొత్తు లేకపోయినా సారీ వైసీపీదే విజయమని ఈ సర్వే సంస్థ గణాంకాలతో సహా చెప్పడం కొసమెరుపు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: