వైసీపీఫై విమర్శలు సరే.. చంద్రబాబు, పవన్ ఆ హామీ ఇవ్వడం మర్చిపోయారే?

praveen
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  ఆంధ్ర రాజకీయాలు ఎంతలా వేడెక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పచ్చ గడ్డి వేస్తే బగ్గు మంటుంది అనే రేంజ్ లో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపి.. ఇక ఒంటరిగా పోటీ చేస్తున్న వైసీపీ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి  ఇక అన్ని పార్టీల్లోని కీలక నేతలు, అభ్యర్థులందరూ కూడా ప్రచార రంగంలో దూసుకుపోయి ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు.

 ఈ క్రమంలోనే నేటి నుంచి మద్యం డబ్బు ఏరులై పారే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే అటు కూటమి నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు స్పష్టమైన హామీలు ఇచ్చారు. జగన్ పార్టీ కూడా ఇలాంటి హామీలతోనే ప్రజల మనసులు గెలుచుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఒక్క విషయంపై మాత్రం  కూటమిలోని మూడు పార్టీల నాయకులు కూడా స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం గమనార్హం. 2019లో తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ మద్యం షాపులను తీసేసి ప్రభుత్వమే మద్యం షాప్ లు నడిపింది ధరలు కూడా భారీగా పెంచేస్తుంది.

 క్రమక్రమంగా మద్యపాన నిషేధం చేస్తాము అంటూ హామీ ఇచ్చింది. కానీ ఇలా మద్యపానం నిషేధం చేయడంలో విఫలమైంది. అయితే దీనినే టార్గెట్గా చేసుకున్న ప్రతిపక్ష పార్టీలు ఇక జగన్ ప్రభుత్వం మద్యపానం నిషేధం చేయడంలో విఫలమైంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఒక హామీని ఇవ్వడాన్ని మాత్రం మరిచిపోతున్నారు. మద్యపాన నిషేధం విషయంలో వైసీపీని విమర్శిస్తున్న టిడిపి, జనసేనలు తాము అధికారంలోకి వస్తే అదే మద్యపానం నిషేధిస్తామని హామీ ఇవ్వడం లేదు. మద్యంపై వస్తున్న ఆదాయమే అటు ప్రభుత్వాలకు ప్రధాన ఆధారంగా కొనసాగుతుండడం ఇందుకు కారణమని తెలుస్తుంది. అయితే మద్యపానాన్ని నిషేధించడం గురుంచి.. దేవుడెరుగు.. ఇంకా విస్తరించే అవకాశం ఉంది అని కూడా ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: