ప్రపంచాన్నే బెదిరిస్తున్న హౌతీ తీవ్రవాదులు?

Chakravarthi Kalyan
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ వాణిజ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం భారత్ సహా పలు దేశాల్లో చమురు ధరలపై పడనున్నట్లు అంచనా. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో క్రూడ్ ఆయిల్ ని భారత్ ఎగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్.. రాకెట్ దాడులు అనంతరం ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ వాతావరణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ చర్యలను కట్టడి చేసేందుకు పలు దేశాలు కృషి చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో ప్రపంచ దేశాల బలహీనత తీవ్రవాదులకు బలమైన ఆయుధంగా దొరికింది. ఇరాన్ ఆధ్వర్యంలో నడిచే హౌతీ, హమాస్, హిజ్బుల్లా, ఇస్లామిక్ రెస్టిస్టెన్స్ ఫోర్స్, ఇంకా పలు ఉగ్రవాద సంస్థలు ఒక కీలకమైన పాయింట్ ని గుర్తించాయి.

అదేంటంటే.. ఏదైనా ఇంధనాలు సూయజ్ కెనాల్ నుంచే రావాలి. యూరోపియన్ దేశాలకు, ఆసియా దేశాలకు ఏదైనా దిగుమతులు రావాలంటే ఈ కెనాల్ ద్వారానే రావాలి. పక్కనే యెమెన్ ఉంది. దీనిని దెబ్బకొడితే ప్రపంచ దేశాలు తమ దారికి వస్తాయని వీరు భావించారు.అనుకున్నది సాధించారు. అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు తమ సైనిక బలగాలను పంపించినా..  ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు చుట్టూ తిరిగి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి.

దీంతో వీరు ప్రపంచ దేశాలను శాసించడం మొదలు పెట్టారు. ఈ సముద్రయానం గుండా ఏ దేశమైనా తమ సరకుతో ప్రయాణించాలంటే వీరికి కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా తీవ్రవాదులు తమ ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఎర్ర సముద్రం, ఇతర సముద్ర మార్గాలను స్తంభింపజేసి తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని హౌతీ తీవ్రవాదులు కీలక ప్రకటన జారీ చేశారు. తద్వారా ప్రపంచం మొత్తాన్ని వణికించడం ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: