ఏపీ: కుప్పంలో తిరగబడ్డ రైతులు..?.

Divya
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో రైతు తిరగబట్టినటువంటి ఉదాంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కుప్పంలో ఎయిర్ పోర్టు కట్టాలని, తద్వారా విదేశాలకు అక్కడ పండించిన పంటలను పంపించాలని దీని ద్వారా రైతులకు ఆదాయం చేకూర్చాలని చంద్రబాబు ఆలోచించారు. అయితే ఇదంతా చేయాలి అంటే అక్కడ రైతులు భూములు ఇవ్వాలి. కానీ తాజాగా కుప్పం విమానాశ్రయానికి సంబంధించిన భూములు విషయంలో అక్కడ రైతులు భూములు ఇచ్చేందుకు సమూఖంగా లేరని అక్కడ భూముల నిర్మాణాల వివరాలను నమోదు చేసేందుకు కూడా అధికారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి.


చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రోజున దండి కుప్పం వద్దకు అధికారులు వస్తున్నారని సమాచారం అందడంతో అక్కడికి పెద్ద ఎత్తున రైతులు చేరుకొని మరి అధికారులతో వాదనకు దిగారు. అధికారులు కూడా నచ్చ చెప్పేందుకు ప్రయత్నించిన ఒప్పుకోలేదు. ఈ విషయంపై రాళ్ళబుదూరు ఎస్సై నరేష్, తాసిల్దార్ ప్రకాష్ బాబు చర్చలు జరిపారు. తమ భూములను ఎట్టి పరిస్థితులలో ఇచ్చేందుకే సముఖంగా లేమని హైకోర్టుని ఆశ్రయించినట్లు 44 మంది రైతులు తెలియజేశారు. అలాగే కోర్టు ఉత్తర్వులు తమ అంగీకారం లేకుండా ఎవరూ కూడా భూములలోకి అడుగుపెట్టకూడదంటూ తేల్చి చెప్పేశారు.


వీటికి తోడు పాతికేళ్ల క్రితం టైడిల్ సిల్క్ పరిశ్రమ అని చెప్పి అమ్మవారిపేట, కిలాకి పోడు రెవెన్యూలో భూములను తీసుకున్నారని, అలాగే 6 సంవత్సరాల క్రితం విజాలాపురం, అమ్మవారిపేట రెవెన్యూలో కూడా భూములు తీసుకున్నారని ఇప్పుడు అవన్నీ కూడా వృధాగా ఉన్నాయని రైతుల నుంచి భూములు సేకరించి ఐదేళ్లలో అభివృద్ధి చేయకపోతే అసలు భూ సేకరణ చట్టం ప్రకారం అది వారికి తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే అధికారులు కేవలం భూసేకరణ కోసం మాత్రమే వచ్చామని చెప్పినా కూడా రైతులు ఒప్పుకోలేదు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన అధికారులకు తమ పొలాలలో ఏర్పాటుచేసిన బోర్డులను కూడా చూపించారు. ఇప్పటికే సేకరించిన 2000 పైగా ఎకరాలలో విమానాశ్రయం నిర్మించాలని ఇవ్వని రైతులను ఇబ్బంది పెట్టకూడదంటూ వైయస్సార్సీపి నేత చక్రపాణి రెడ్డి అధికారులను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: