కేసీఆర్ పై రేవంత్ చేసిన శపథం నెరవేరేనా.?

Pandrala Sravanthi
రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ సభలో మాట్లాడిన మాటలు రాజకీయాల్లో తీవ్ర దుమారం సృష్టించాయి. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కలిపి ఈయన తీవ్రస్థాయిలో దూషణలు చేశారు.ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ ను మీరెంత మీ బతుకేంతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కొడంగల్ సభ లో రేవంత్ రెడ్డి కొన్ని శపథాలు కూడా చేశారు. అయితే రీసెంట్ గా కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టుతూ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఒక్కొక్కరి దుమ్ము దులుపుతా అన్నట్లుగా విమర్శించారు. అయితే కేసీఆర్ అలా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటారా.. రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ సభలో కేసీఆర్ ను ఉద్దేశించి  చాలా ఘాటుగా మాట్లాడుతూ నువ్వెంతా నీ బతుకెంతా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


 అంతేకాదు జీవితంలో మళ్లీ నిన్ను అధికారంలోకి రానివ్వనని శపథాలు కూడా చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పండబెట్టాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాం.. రాబోయే రోజుల్లో కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది.మీ సంగతి తేలుస్తాను అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు ప్రెస్మీట్లో చర్చలు చేయడం ఏంటి..అసెంబ్లీలో చర్చలకు రావాలి అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టు అసెంబ్లీలో చర్చలకు వెళ్దామంటే అసలు అసెంబ్లీ ఏ తీరున నడుస్తుందో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతా పిటిషన్ వేస్తే స్పీకర్ అయిదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టు ఆధారాలు లేవని చెప్పారు. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల గురించి ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇక రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో మాట్లాడిన మాటల గురించి కొంతమంది తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


ఎందుకంటే కేసీఆర్ ని విమర్శించడంలో తప్పులేదు. కానీ నువ్వెంత నీ బతుకెంతా అనే వ్యాఖ్యలు మాత్రం చాలా వరకు తప్పు అని.. కనీసం ఆయన వయసుకైనా మర్యాద ఇచ్చి మాట్లాడాలని అంటున్నారు. ఇక మరో విషయం ఏమిటంటే.. జీవితంలో నిన్ను అధికారంలోకి రానివ్వను అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సాధ్యమా.. అంటే అస్సలు సాధ్యం కాదు.. ఎందుకంటే అధికారం అనేది మన చేతుల్లో ఉండదు.. ఒకవేళ అధికారం అనేది మన చేతుల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండేది కాదు. అలాగే ఆంధ్రాలో ఇప్పటివరకు అధికారంలోకి రాకుండా ఉండేది కాదు. ముఖ్యంగా ఈ విషయాలను రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో బీఆర్ఎస్ పార్టీని,కేసీఆర్, కేటీఆర్ లను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లో తీవ్ర దుమారం సృష్టించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: