2025 టాలీవుడ్‌ రివ్యూ: స్టార్ హీరోయిన్ల పోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

బడా హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనంగా మారుతున్న ఈ కాలంలో, హీరోయిన్లు మాత్రం బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. 2025 ముగుస్తున్న తరుణంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల ప్రోగ్రెస్ కార్డును పరిశీలిస్తే, కొందరికి విజయాలు పలకరించగా, మరికొందరికి నిరాశే మిగిలింది.
సమంత: కొత్త జీవితం.. కొత్త ప్రయాణం :
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సమంత తన సొంత నిర్మాణంలో వచ్చిన ‘శుభం’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. వ్యక్తిగత జీవితంలో రెండో పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణం ప్రారంభించిన సామ్, ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ చేస్తోంది. 2026లో ఆమె మళ్ళీ వెండితెరపై పూర్వవైభవం చాటుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.


రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ జోరు :
ఈ ఏడాది 6 సినిమాలతో రష్మిక సందడి చేసింది. అందులో నాలుగు పాన్ ఇండియా చిత్రాలే. ‘చావా’, ‘కుబేర’ మరియు ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకుంది. సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘సికిందర్’, హిందీ చిత్రం ‘థామా’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. మొత్తం మీద రష్మికకు ఇది సక్సెస్ ఫుల్ ఏడాది.
శ్రీలీల & అనుష్కకు నిరాశే :
శ్రీలీల: ‘పుష్ప 2’లో కిస్సిక్ పాటతో క్రేజ్ తెచ్చుకున్నా, హీరోయిన్‌గా చేసిన ‘రాబిన్ హుడ్’, ‘మాస్ జాతర’, ‘జూనియర్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె ఐరన్ లెగ్ ముద్రను పోగొట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఘాటీ’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అనుష్క‌ సినిమాల నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది.


తమన్నా, కీర్తి సురేష్ :
తమన్నా: ఐటెం సాంగ్స్ కే పరిమితం కాకుండా ‘ఓదెల 2’ లో అఘోరాగా వైవిధ్యమైన ప్రయత్నం చేసి ప్రశంసలు అందుకుంది. కీర్తి సురేష్కి ఈ ఏడాది కీర్తికి కలిసిరాలేదు. ‘ఉప్పు కప్పురంబు’, ‘రివాల్వర్ రీటా’ వంటి సినిమాలు ఓటీటీలో వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. రాశీ ఖన్నా: ‘తెలుసు కదా’ నిరాశ పరిచినా, ఆమె ఆశలన్నీ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే ఉన్నాయి. నిధి అగర్వాల్ ఈ ఏడాది నిధికి చాలా కీలకం. ‘హరి హర వీరమల్లు’తో పాటు ప్రభాస్ ‘రాజా సాబ్’ పైనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంది. ఫైన‌ల్‌గా 2025లో రష్మిక టాప్ గేర్‌లో దూసుకుపోగా, సమంత మళ్ళీ పుంజుకునే ప్రయత్నంలో ఉంది. శ్రీలీల, కీర్తి సురేష్ వంటి వారు 2026లో అయినా సాలిడ్ హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: