ఆ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్న రామ్... పూరి..?

MADDIBOINA AJAY KUMAR
కొంత కాలం క్రితం హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నబా నటేష్ , నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించగా ... మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి అంచనాల నడమే విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ కంటే ముందు రామ్ కి వరస అవజాయలు ఉన్నాయి.

అలాంటి సమయంలో ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించి రామ్ కి మంచి జోష్ ను తీసుకు వచ్చింది. ఇకపోతే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి కూడా ఈ మూవీ కంటే ముందు అనేక అపజయాలు ఉన్నాయి. ఈ సినిమా విజయంతోనే పూరి కూడా విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత రామ్ పోతినేని "ది వారియర్" రీసెంట్ గా స్కంద మూవీ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి లేకపోతే పూరి జగన్నాథ్ ఈస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ హీరో గా లైగర్ అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీ ని తెరకెక్కించాడు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయన్ని ఎదుర్కొంది. ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరూ మల్లి అపజయాలోనే ఉన్నారు. దానితో ఈస్మార్ట్ శంకర్ మూవీ కొనసాగింపుగా రూపొందుతున్న డబల్ ఇస్మార్ట్ మూవీ పై వీరిద్దరూ మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే తిరిగి మళ్లీ వీరిద్దరూ కం బ్యాక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ కి కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: