కల్కి మూవీతో ప్రభాస్ కి సరికొత్త టాగ్..!

lakhmi saranya
కొన్ని మూవీస్ కి అందులో నటించే హీరో ద్వారా ఆయన లేదా ఇతర కారణాల చేత అయినా మంచి ఇమేజ్ ఏర్పడుతూ ఉంటుంది. సినిమా రిలీజ్ కాకముందే పక్కా సూపర్ హిట్ అనే టాక్ వస్తూ ఉంటుంది. అటువంటి వాటిలో రీసెంట్గా రూపొందిన కల్కి మూవీ కూడా ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపిక పడుకునే అండ్ దిశా పటాని హీరోయిన్స్ గా.. అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ నేడు అనగా జూన్ 27వ తారీకున గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ అయింది.

ఇక ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది ఈ మూవీ. దీంతో సినీ ఇండస్ట్రీకి చంద్ర సెలబ్రిటీలు సైతం థియేటర్ ని ఆశ్రయించి ప్రభాస్ సినిమాని ఆదరిస్తున్నారు. ఇక ఈ మూవీలో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ అండ్ దుర్కర్ సల్మాన్ కూడా ముఖ్య పాత్రలు పోషించినట్లు ఇప్పటికే నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి చిత్రం ప్రజెంట్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు డార్లింగ్ అనే టాగ్ తో ఉన్న ప్రభాస్ కల్కి మూవీ తో సరికొత్త టాగ్ని సంపాదించుకున్నాడు. అదే బైరవ. ఈ సినిమాలో భైరవ అనే పాత్రలో ప్రభాస్ అదరగొట్టాడు. దీంతో ప్రభాస్ డార్లింగ్ ట్యాగ్ కాస్త భైరవగా మారింది. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ న్యూస్ విన్న వారంతా.. డార్లింగ్ డార్లింగే భైరవ బైరవనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ చాలా కాలం అనంతరం ప్రభాస్ ఖాతాలో ఓ మంచి హిట్ పడుతుందని తన అభిమానులు ఫిక్స్ అయిపోయారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: