ఆ తప్పు చేయకపోతే చిరంజీవి సీఎం అయ్యేవారా.. రాజకీయాల్లోనూ అదుర్స్ అనిపించారుగా!

Reddy P Rajasekhar
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో సంచలన విజయాలను సొంతం చేసుకుని సినిమా ఇండస్ట్రీలోకి రావాలని భావించే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. సినిమాల్లో చిరంజీవి సాధించిన విజయాలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు కూడా సీనియర్ హీరోలలో నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా చిరంజీవి అనే సమాధానం చెప్పవచ్చు. చాలామంది చిరంజీవి రాజకీయాల్లో సక్సెస్ కాలేదని భావిస్తారు.
 
అయితే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయం సరైన కాదని 2014 లేదా 2019లో చిరంజీవి పాలిటిక్స్ లోకి వచ్చి ఉంటే కచ్చితంగా సంచలన ఫలితాలు సొంతమయ్యే అవకాశం ఉండేదని చాలామంది భావిస్తారు. ఇతరులను ఘాటుగా, బాధ పెట్టేలా విమర్శలు చేసే గుణం లేకపోవడం రాజకీయాల్లో చిరంజీవికి మైనస్ అయిందని మరి కొందరు భావిస్తారు. అయితే చిరంజీవి రాజకీయాల్లో సాధించిన విజయాలు సైతం తక్కువేం కాదు.
 
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించింది. పార్టీ పెట్టిన ఏడాదిలోనే ఈ స్థాయి ఫలితాలు సాధించడం సులువైన విషయం కాదు. తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిరంజీవి తర్వాత రోజుల్లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో ఆయన కొనసాగారు.
 
సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగించి ఉంటే చిరంజీవి సీఎం అవ్వాలనే అభిమానుల కల కచ్చితంగా నెరవేరి ఉండేది. తక్కువ సమయం రాజకీయాల్లో కొనసాగడం చిరంజీవి చేసిన తప్పని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే సౌమ్యుడైన చిరంజీవికి రాజకీయాలు సూట్ కావని కొంతమంది భావిస్తారు. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా తమ్ముడికి మద్దతు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే తమ్ముడు రాజకీయాల్లో సక్సెస్ అయినా చిరంజీవి మాత్రం భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. వరుస పాన్ ఇండియా సినిమాలతో చిరంజీవి సినిమాల్లో సత్తా చాటుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: