జగన్‌ ఇక మారడా: వైసీపీ ఓడినా కూడా సజ్జలకే అన్ని పవర్స్ ?

Veldandi Saikiran
* ఓడిపోయిన కూడా  సలహాదారుల బాటలోనే జగన్
* సజ్జల రామకృష్ణకు మళ్లీ అదే ప్రాధాన్యత
* సలహాదారుల విషయంలో చేసిన తప్పే చేస్తున్న జగన్
* పార్టీలో కీలక నేతలకు తగ్గుతున్న ప్రాధాన్యత
* ఐ ప్యాక్ ఇన్వాల్వ్మెంట్  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... జగన్మోహన్ రెడ్డి  అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. 175 స్థానాలకు 175 సీట్లు గెలుస్తానని... ప్రగల్బాలు పలికిన  జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు ఏపీ ప్రజలు. ఫలితంగా... కేవలం 11 స్థానాలు మాత్రమే వైసిపి పార్టీకి రావడం జరిగింది. అంతేకాకుండా ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా వైసిపికి దక్కేలా కనిపించడం లేదు. అయితే తన ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి అనేక తప్పిదాలను చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
 అందులో ముఖ్యంగా... సలహాదారులు అలాగే ఐపాక్ సంస్థ జగన్మోహన్ రెడ్డి కొంపముంచాయని అందరూ అనుకుంటున్నారు. వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, లీడర్ల మాటలు వినకుండా... వారికి అపాయింట్మెంట్  ఇవ్వకుండా... ఐ ప్యాక్  ను జగన్మోహన్ రెడ్డి పాలో అయ్యారు. అసలు ఎమ్మెల్యేలను కూడా... దగ్గరకు రానివ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలను... మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది వ్యక్తపరిచారు.
 అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పాలనలో సలహాదారుల పాత్ర ఎక్కువైపోయింది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి... ముఖ్యమంత్రి లెవల్లో ముందుకు వెళ్లారు. క్రైమ్ సంఘటన జరిగిన, పరీక్షల ఫలితాలు విడుదలైన, కరోనా లాంటి వ్యాధులు వచ్చినా, పెను ప్రమాదాలు జరిగినా ఆయా శాఖల మంత్రులు స్పందించకుండా... సజ్జల రామకృష్ణ రెడ్డి ముందు ఉండేవారు. ఏ సంఘటన జరిగినా కూడా మీడియా ముందుకు వచ్చి... అన్ని వివరాలు తెలిపి... మంత్రుల ప్రాధాన్యత తగ్గించేశారు.
 జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా కూడా... సజ్జల రామకృష్ణారెడ్డి నీ ముందు కలవాలని ఒక రూల్ పెట్టారట. ఇదే వైసీపీకి పెద్ద దెబ్బ అయిందని కూడా కొంతమంది అంటున్నారు. ఇక మొన్న ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత కూడా సజ్జలనే మాట్లాడారు. గతంలో టిడిపి మేనిఫెస్టో  ను తయారుచేసిన సజ్జల లాంటి వ్యక్తులను సలహాదారులు పెట్టుకుంటే... జగన్ కు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: