జగన్ కు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తోందా.. మంచి చెప్పిన వాళ్లనే ముంచేస్తున్నాడా?

Reddy P Rajasekhar
మాజీ సీఎం జగన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను సరిగ్గా గమనిస్తే ఆయనకు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తోందా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గత ఐదేళ్లలో సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన జగన్ మంచి చెప్పిన వాళ్లనే ముంచేస్తున్నాడని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. కొంతమంది నేతలు తమను ఓడించారని జగన్ కు ఫిర్యాదు చేస్తే జగన్ మాత్రం ఆ ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.
 
జగన్ రివర్స్ లో నేతలు ఎవరిపై ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదులను సైతం తప్పు చేసిన నేతల దగ్గర ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేసిన వాళ్లను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ తెలివిగా అడుగులు వేయకుండా ఈ విధంగా చేస్తుంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నామని కొందరు వైసీపీ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు రాజకీయాలపై ఆసక్తి తగ్గిందా అనే కామెంట్లు సైతం చేస్తున్నారు.
 
చాలామంది వైసీపీ నేతలు ఆరు నెలలు లేదా ఏడాది కూటమికి సమయం ఇస్తామని ఆ తర్వాత కూటమి చేసే తప్పులను ఎత్తిచూపుతామని చెబుతున్నారు. వైసీపీ నేతలు ఇలాంటి తప్పులు చేస్తే ఏడాది తర్వాత పార్టీ ప్రజలకు గుర్తు కూడా ఉండదని చెప్పవచ్చు. కూటమి తీసుకున్న నిర్ణయాలపై, అమలు చేస్తున్న పథకాలపై జగన్ ఇప్పటివరకు కనీసం స్పందించలేదు.
 
రాజీనామా చేసిన వాలంటీర్లకు సైతం జగన్ అండగా నిలబడే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ తీరును చూసి కొంతమంది వైసీపీ నేతలు పార్టీ అధినేత ఇలా ఉంటే నిరాశానిస్పృహలకు లోనవుతున్నారు. జగన్ కు సలహాలు, సూచనలు ఇచ్చినా లాభం లేదని మరి కొందరు భావిస్తున్నారు. జగన్ తాను మునగడంతో పాటు పార్టీని ముంచేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూటమికి షాకివ్వడానికి జగన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళతారో చూడాల్సి ఉంది. జగన్ సరైన సలహాదారులను నియమించుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: