కేసీఆర్ షాక్.. కాంగ్రెస్ లోకి మామ, అల్లుళ్లు ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో... గులాబీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత ఆ పార్లమెంట్ ఎన్నికల్లో జీరో స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో... టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ జారుకుంటున్నారు. పది సంవత్సరాలపాటు ఆ పార్టీలో పదవులు అనుభవించి... ఇప్పుడు కేసీఆర్ కు వెన్నుపోటు పొడుస్తున్నారు.
 ఏ పార్టీలో ఉన్నా సరే మాకు అధికారమే ముఖ్యమైనట్లుగా... ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. ఇందులో భాగంగానే గులాబీ పార్టీ నుంచి ఇప్పటికి ఆరుగురు ఎమ్మెల్యేలు... కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది లీడర్లు... కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బడా లీడర్ మాజీ మంత్రి మల్లారెడ్డి... కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారట.
 వాస్తవానికి ఆయన ఎప్పుడూ గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేవారట.  కానీ మైనంపల్లి హనుమంతరావు  కారణంగా కాంగ్రెస్ పార్టీలో... మల్లారెడ్డి చేరడం ఆలస్యమైందని చెబుతున్నారు. ఆయన రాకను మైనంపల్లి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అయితే ఈ విషయంలో...  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి... మైనంపల్లి తో చర్చలు చేశారట.
 అతి త్వరలోనే... ఈ అడ్డంకులు కూడా తొలగించనున్నారట ఆ వేం నరేందర్ రెడ్డి. ఆ చిక్కులు క్లియర్ అయిన తర్వాత... మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి  ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. ఈ మేరకు... అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట మామ అల్లుళ్లు. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత...  మల్లారెడ్డి అలాగే ఆయన అల్లుడు కాలేజీలపై దాడులు, తదితర కార్యక్రమాలను రేవంత్ రెడ్డి చేస్తున్నారు. పోలీసు కేసులు, కట్టడాలను కూల్చివేయడం లాంటివి చేసి మల్లారెడ్డి అలాగే ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని రేవంత్ రెడ్డి చాలా ఇబ్బందులు చేస్తున్నారు.  అయితే ఈ ఇబ్బందులు  పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ లోకి వెళ్లడమే  ముఖ్యమని మల్లారెడ్డి భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: