కనీసం ఆరు నెలలైనా సమయం ఇవ్వు జగన్.. తొందరపడి విమర్శలు సరికాదుగా!
ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కూడా కాలేదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ, పింఛన్ల పెంపు లాంటి కీలక హామీల దిశగా అడుగులు వేశారు. ఈ నెల 1వ తేదీన 7,000 రూపాయల పింఛన్లు అందుకున్న అవ్వాతాతలు పడిన ఆనందం అంతాఇంతా కాదు. అయితే జగన్ అప్పుడే చంద్రబాబు పాలనపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
అయితే జగన్ కనీసం ఆరు నెలలైనా సమయం ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొందరపడి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సైతం నవరత్నాలలో భాగంగా చెప్పిన పథకాలను వెంటనే అమలు చేయలేదు. జగన్ కొన్ని పథకాలను కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అమలు చేశారు.
జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల విషయంలో సైతం ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. జగన్ తొందర పడటం వల్ల పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. జగన్ పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు దొరకడం కష్టమనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. జగన్ కొంతకాలం సైలెంట్ గా ఉండాలని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయం అమలులోకి రావాలంటే మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం స్కీమ్స్ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పథకాల అమలు కోసం బాబుకు జగన్ సమయం ఇవ్వకుండా విమర్శలు చేస్తే లాభం అయితే ఉండదు. పథకాల అమలు ఆలస్యమైతే వైసీపీకే బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. వైసీపీలో ప్రస్తుతం జగన్ కాకుండా ఎవరు మాట్లాడినా ప్రజలు కనీసం పట్టించుకునే పరిస్థితులు కూడా లేవనే సంగతి తెలిసిందే. జగన్ కుటుంబ సభ్యులు సైతం ఆయనకు అండగా నిలబడకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.