అందం కోసం బ్యూటీ పార్లర్స్ కే వెళ్లాలా ఏంటి..? అవిసె గింజలతో కూడా సాధ్యం..!

lakhmi saranya
అవిసె గింజలు చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్లే ప్రతి ఇంట్లో వీటిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలో ఉండే ఓమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అందాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి. అవిసె గింజలను మూడు నుంచి నాలుగు గంటలు నీటిలో నానబెట్టి అనంతరం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేయడంతో ముఖం అండ్ మెడ అందంగా తయారవుతుంది. అవిస గింజల పేస్ట్ ను లేదా జల్ ను తరచూ మీ చర్మంపై రాసుకోవడం ద్వారా చర్మం బిగుతుగా మారుతుంది. అదేవిధంగా నిత్యం యవ్వనంగా ఉండవచ్చు. అవిస గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి అనంతరం రోజ్ వాటర్ లో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.

దీన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. బయట చర్మంతో పాటు లోపలి చర్మం ఆరోగ్యంగా ఉంటేనే ముఖంపై సహజమైన మెరుపు కనిపిస్తుంది. అవిసె గింజల పొడిని ఒక గుడ్డు తెల్ల సోనాలో కలిపి ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తే చర్మం లోపల నుంచి ఆరోగ్యంగా మారుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అదేవిధంగా అవిస గింజల నూనెను ఉపయోగించడంతో మీ జుట్టు బలంగా మారుతుంది కూడా. అదేవిధంగా మెరిసే కురుల కోసం ఈ నూనెను తలచు ఉపయోగించవచ్చు. అవిసె గింజలతో తయారు చేసిన హెయిర్ జెల్ తో జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.

ఇక పచ్చి అవిసె గింజలు రోజు తినడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ గుణాలు మన జుట్టుకి అండ్ శరీరానికి బాగా తోడ్పడతాయి. అవిస గింజలతో చేసే హెయిర్ ప్యాక్ చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలను పొడి చేసుకుని అందులో 1/2 కప్పు పెరుగు అండ్ నాలుగు చుక్కల నూనె వేసుకుని మీ జుట్టుకు పట్టిస్తే మీ జుట్టు మృదువుగా అండ్ చుండ్రు పోతుంది కూడా. ఇన్ని ఉపయోగాలున్న అవిస గింజలను ప్రతి రోజు కాకపోయినా వారానికి రెండు రోజులు మీ మొఖానికి అండ్ హెయిర్ కి అప్లై చేసి ఈ అద్భుతమైన బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: