నాగార్జునకు రేవంత్ షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం..?
తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. కాగా దాని పై హైడ్రా కు మరోసారి ఫిర్యాదులు అందాయి . ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి.. కూల్చివేతల కు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య .. జంబో జేసీబీలతో ఎన్ కన్వెన్షన్ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు. కాగా దీని పై నాగార్జున స్పందిస్తూ.. ఆ భూమి పట్టా భూమి అని.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు ..
ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు . తాజాగా ఇప్పుడు మరోసారి నాగ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కరరెడ్డి . మరి దీని పై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడలి . మరోవైపు మంత్రి కొండా సురేఖ సమంత , అక్కినేని ఫ్యామిలీ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో కొండా సురేఖ పై నాగ్ లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. ఇలా నాగార్జునకు ఊహించని విధంగా రేవంత్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో నాగార్జునను అరెస్టు చస్తారని అనుమానాలు కూడా ఉన్నాయి.