తారక్ నుండి నాగ్ వరకు.. బిగ్ బాస్ హోస్టులు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

praveen
తెలుగు బుల్లితెర పై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్ బాస్ కార్యక్రమం ఎంత సూపర్ సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ లో మొదటి సీజన్ ఏకంగా ప్రేక్షకులందరికీ కూడా కట్టిపడేసింది. దీంతో బిగ్ బాస్ షో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అని అందరికీ అర్థమయిపోయింది అని చెప్పాలి. అయితే మొదటి సీజన్ కు హోస్టింగ్ చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత మాత్రం ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

 అయితే బిగ్ బాస్ హోస్ట్గా ఎన్టీఆర్ తప్పుకున్న తర్వాత నాని చేతికి ఆ బాధ్యతలు వచ్చాయి. ఇక రెండవ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించాడు నాని. కానీ అతని హోస్టింగ్ పై విమర్శలు వచ్చాయి. నాని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని కంట్రోల్ చేయలేకపోయాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేశారూ అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలాంటి ట్రోలింగ్ రావడంతో మూడో సీజన్ హోస్టింగ్ బాధ్యతల నుంచి నాని కూడా తప్పుకున్నాడు. ఆ సమయంలోనే ఇక హోస్ట్ గా బాధ్యతలు చేపట్టిన నాగార్జున గత ఐదు సీజన్లో నుంచి కూడా బిగ్ బాస్ హోస్ట్ గా సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎనిమిదవ సీజన్లో కూడా ప్రేక్షకులను హోస్ట్ గా అలరిస్తున్నాడు నాగర్జున.

 ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏడు సీజన్ లో సక్సెస్ ఫుల్ గా ముగియగా ఇప్పుడు 8వ సీజన్ ప్రసారమవుతుంది. కాగా ముగ్గురు స్టార్ హీరోలు బిగ్ బాస్ షో కి హోస్ట్ లుగా గా వ్యవహరించారు. వీరిలో ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్నది హాట్ టాపిక్ మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతున్న నాగార్జున మొదటి ఎపిసోడ్ కు 10 నుంచి 15 లక్షలు తీసుకున్నారట. కానీ ఇప్పుడు టోటల్ సీజన్ మొత్తానికి 15 కోట్లు పుచ్చుకుంటున్నాడట. నాగార్జున కంటే ముందు హోస్ట్ చేసిన నేచురల్ స్టార్ నాని ఒక్కో ఎపిసోడ్ కి పది నుంచి 12 లక్షల పారితోషకం అందుకున్నాడట. ఫస్ట్ సీజన్ హోస్ట్ ఎన్టీఆర్ ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కి 35 లక్షల రూపాయల పారితోషకం అందుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: