ఎన్టీఆర్ సినిమాలో ఆ లెజెండ్రి యాక్టర్.. నీల్ మావ ప్లాన్ మాములుగా లేదుగా..?

murali krishna
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర” టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి  బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు 405 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలలో విలన్ గా నటించారు.ఎన్టీఆర్ అభిమానులు 'దేవర' మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద వున్నారు. తాజాగా ‘దేవర’ చిత్రానికి సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా జరిగాయి. త్వరలోనే ‘దేవర 2 ‘ షూటింగ్ ప్రారంభం కానుంది అని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే  ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తరువాత సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్  మొదలు కానుంది.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.ఈ సినిమా కథ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎవ్వరూ చూడని విధంగా ఉంటుందని సమాచారం.. ఇందులో తమిళ లెజెండ్రి యాక్టర్ లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే కల్కి సినిమాలో తన అద్భుతమైన నటనతో మెప్పించిన కమల్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తాడో అని చర్చలు జరుగుతున్నాయి. వీళ్లిద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనవసరం లేదు. ఇద్దరి టాలెంట్ ని సంపూర్ణంగా వాడుకునే కథతోనే ప్రశాంత్ నీల్ మన ముందుకు రాబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర మాత్రమే కాదు, ఎన్టీఆర్ పాత్ర కి సంబంధించి కూడా చాలా నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: