కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించని బాలయ్య.. ఇందుకేనా..!?

Anilkumar
మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలతో పాటు.. ఇటు తెలుగు చిత్రసీమలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. కొండా సురేఖ అక్కినేని కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు కింగ్ నాగార్జున. ఇప్పటికే.. కొండా సురేఖ ఆరోపణలపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. అయితే.. ఈ వ్యవహారంపై మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాగార్జున. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు నాగార్జున సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా

 స్పందించిన నాగార్జున.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు త‌మ కుటుంబ పరువుకు భంగం కలిగించాయని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలున్నాయని పిటిషన్‌లో నాగార్జున పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. నాగార్జున వేసిన పిటిషన్‌పై  (అక్టోబర్ 04న) విచారణ జరగాల్సి ఉండగా.. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా..

 అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్‌గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తుంది. బాలయ్య రియాక్ట్‌ కాకపోవడానికి రెండు కారణాలు ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతుదారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: