మూడు సార్లు చిరంజీవితో నటించే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిన నటుడు.. ఎందుకంటే?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అజయ్ ఘోష్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. 2010లో విడుదలైన ప్రస్థానం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన అజయ్ ఘోష్ తన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. ఇటీవల అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో కనిపించి పర్వాలేదనిపించుకున్నారు. బెదురులంక 2012, సరిపోదా శనివారం, మంగళవారం సినిమాలతో నటుడు అజయ్ ఘోష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. అలాగే ఈయన తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ భాషల్లో కూడా నటించారు. అజయ్ ఘోష్ రాజు గారి గది సినిమాలో నటించి.. 2019లో సైమా ఉత్తమ హాస్యనటుడు అవార్డు సొంతం చేసుకున్నాడు.
అయితే, ఒక నటుడిగా ఎవరికైనా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించాలని ఉంటుంది. కానీ, అజయ్ ఘోష్ మాత్రం చిరంజీవితో నటించే అవకాశం వచ్చిందట. అది కూడా ఒక్క సారి కాదు.. రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు వచ్చిందట. చిరంజీవి హీరోగా చేసిన గాడ్ ఫాదర్, ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించే అవకాశం లభించినప్పటికి.. హాస్య నటుడు అజయ్ ఘోష్ ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్ల చిరంజీవి మూవీస్‌ను మూడు సార్లు రెజెక్ట్ చేయాల్సి వచ్చిందట.