చరణ్ ఆ సీన్స్ చేయాలంటే జక్కన్న పర్మిషన్ కావాలట!

MADDIBOINA AJAY KUMAR
మెగా హీరో రామ్ చరణ్ గురించి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా  ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాజమౌళి హాజరయ్యాడు. జక్కన్న గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్ చేశాడు.
ట్రైలర్ లంచ్ చేశాక రాజమౌళి, హీరో రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అనంతరం జక్కన్న మాట్లాడుతూ..  'నేను రామ్ చరణ్ ని మగధీర సినిమా నుంచి చూస్తున్నాను. అప్పటికీ, ఇప్పటికీ చరణ్ లో తేడా ఉంది. అలాగే నా దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామ్ చరణ్ కి చాలా తేడా ఉంది. నటనపరంగా ఎంతో పరిణితి చెందాడు. ఇంత హైట్స్ కి రీచ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నాతో కలసి పనిచేసిన ఆర్టిస్టులను నేను వారి రియల్ పేర్లతో కాకుండా ఇతర పేర్లతో పిలుసస్తుంటాను. అయితే నేను రామ్ చరణ్ ని ఎప్పుడూ కూడా హీరో అనే పేరుతో మాత్రమే పిలుస్తాను' అని రాజమౌళి అన్నాడు.
అలాగే గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ లోని హెలికాఫ్టర్ షాట్స్, ఏడుస్తూ ఫోన్ మాట్లాడే సీన్స్ కచ్చితంగా ఆడియన్స్ ని ఎమోషనల్ గా కట్టిపడేస్తాయని జక్కన్న చెప్పుకొచ్చారు. వాటితో పాటు సముద్రంలో గుర్రంతో పాటూ ఈదుతున్న సీన్స్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పటినుండి రామ్ చరణ్ గుర్రంతో కలసి చేసే సీన్స్ ఏమైనా ఉంటే ముందుగా తన పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఎందుకంటే వాటిపై అన్ని రైట్స్ తనకే ఉన్నాయని హస్యంగా చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: