దీపిక తో ఎంజాయ్ మెంట్ అంటే మామూలుగా ఉండదంతే..!

shami
స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ కి ప్రమోట్ అయిన దీపిక పిల్లి ఈమధ్య బొత్తిగా నల్లపూస అయ్యింది. అంతకుముందు ఈటీవీ, స్టార్ మా లో షోలు చేసుకుంటూ అలరించిన దీపిక ఇప్పుడు చేస్తే సినిమాలే తప్ప స్మాల్ స్క్రీన్ లేదని అంటుంది. అందుకే ఈమధ్య పెద్దగా కనిపించట్లేదు. దీపిక పిల్లి సుధీర్ నటించిన వాంటెడ్ పండుగాడ్ లో నటించినా లాభం లేకుండా పోయింది. అందుకే అమ్మడు కాస్త గ్యాప్ తీసుకుని సరైన సినిమాతో అవ్వాలని అనుకుంది.
ప్రస్తుతం దీపిక యాంకర్ ప్రదీప్ తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేస్తుంది. ఈ సినిమా తో సిల్వర్ స్క్రీన్ పై తన లక్ మళ్లీ టెస్ట్ చేసుకుంటుంది దీపిక. యాంకర్లు కథానాయికలుగా సక్సెస్ అవ్వడం కష్టమే కానీ తన టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తుంది దీపిక. అందుకే సినిమాల కన్నా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో ఎక్కువ కలరింగ్ ఇస్తుంది.
లేటెస్ట్ గా న్యూ ఇయర్ ఫెస్ట్ లో తన ఫోటో షూట్ తో రచ్చ చేసింది దీపిక పిల్లి. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నటు ఉన్న అమ్మడి తన లుక్స్ తో సర్ ప్రైజ్ చేసింది. హీరోయిన్ మెటీరియలే అయినా ఎందుకో అమ్మడికి కాలం కలిసి రావట్లేదు. ఒక హిట్ పడితే మాత్రం తప్పకుండా దీపిక మంచి పొజిషన్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ప్రదీప్ సినిమాతో పాపులర్ అవ్వాలని చూస్తున్న దీపిక కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. అమ్మడు మాత్రం సినిమాల్లోనే చేస్తా అని గట్టిగా ఫిక్స్ అయ్యింది కాబట్టే స్మాల్ స్క్రీన్ నుంచి దూరమైంది. ఐతే యాంకర్ గా ఎంట్రీ ఇచ్చే ప్రతి హీరోయిన్ కి హీరోయిన్ అవ్వాలనే ఉంటుంది. మరి దీపిక పిల్లికి నెక్స్ట్ రాబోయే సినిమాలతో అయినా ఆమె ఫేట్ మారుస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: