సంధ్య థియేటర్ ఘటన.. పుష్ప నిర్మాతలకు రిలీఫ్
దీంతో హై కోర్టు పుష్ప 2 నిర్మాతలని అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఎట్టకేలకి పుష్ప 2 నిర్మాతలకి ఈ కేసులో ఊరట లభించింది. అలాగే న్యాయ స్థానం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసినట్లు తెలిపింది.
ఇకపోతే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సినీ ఇండస్ట్రీలో పేను తుఫానుగా మారింది. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అనంతరం స్టార్ హీరో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద బయటికి కూడా వచ్చారు.