SSMB 29.. రాజమౌళి ఆట మొదలైంది..!

shami
సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి సినిమా గురువారం పూజా కార్యక్రమాలు పూర్తైనట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమా పూజ గురించి ఎవరికీ తెలియదు కానీ మీడియాకు లీక్ వచ్చేసింది. హైదరాబాద్ ఫ్యాక్టరీ లో చాలా సైలెంట్ గా ఈ పూజ జరిగింది. ఐతే ఇంత భారీ బడ్జెట్ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇంత సీక్రెట్ గా జరగడం పట్ల చాలామందికి డౌట్లు పెరుగుతున్నాయి.
ఓ పక్క మహేష్ తన సినిమా పూజకు రావడం సెంటిమెంట్ బ్రేక్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఐతే మీడియాకు ఈ ఫోటోలు ఇవ్వకపోవడం వెనక మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరి ప్లాన్ ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా మహేష్ లుక్ ని రివీల్ చేయకూడదనే ఆలోచనతో పాటుగా రాజమౌళి మహేష్ సినిమా ఆట మొదలు పెట్టాడని తెలియాలంటే ఏదో ఒకటి డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి. అందుకే సినిమా పూజని ఎవరికీ చూపించలేదు.
ఆ తర్వాత ఎప్పుడైనా ఈ వీడియో వదులుతారేమో కానీ అప్పటికప్పుడు పెద్దగా హడావిడి ఉండదు అని జక్కన్న ప్లాన్. రాజమౌళి సినిమా మొదలవడమే ఒక సంచలనం. అందుకే పూజకి మీడియాని పిలిస్తే నానా హంగామా ఉంటుందని వద్దనుకున్నారని చెప్పొచ్చు. లేదా మహేష్ సెంటిమెంట్ ని గౌరవిస్తూ పూజకి తానొచ్చినా బయట ఫోటోలు మాత్రం వదలొద్దని చెప్పి ఉండొచ్చు. ఏది ఏమైనా మహేష్ 29 పూజ జరిగింది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్ ని కూడా దించుతున్నట్టు తెలుస్తుంది. మహేష్ రాజమౌళి సినిమాలో ప్రస్తుతం కాస్టింగ్ ఎవరన్నది వెతుకుతున్నారు. సెట్స్ మీదకు వెళ్లే టైం లో పూర్తి కాస్ట్ తో ఈ సినిమా గురించి రాజమౌళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: