షాకింగ్..ఆ సినిమా కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ బ్రేక్ చేసిన ప్రిన్స్!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ పూజా కార్యక్రమం కూడా ఇటీవల మొదలైంది. ఈ మేరకు ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు ఏళ్లుగా పాటిస్తున్న ఓ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడనేది లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతుంది.  మరి ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసుకుందాం.
నేడు ఎలాంటి హంగామా లేకుండా జక్కన్న హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీ పూజా సెరిమోని కూడా జరిగింది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం ఏళ్లుగా ఫాలో అవుతున్న సెంటిమెంట్ ని మహేష్ బాబు బ్రేక్ చేశాడని సమాచారం. అయితే మహేష్ బాబు టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మురారి మూవీతో మహేష్ బాబు భారీ హిట్ కొట్టాడు. అప్పటినుండి ఆయన మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ఒక్కడు, అతడు, అర్జున్, పోకిరి, దూకుడు, అతిథి, ఖలేజా, ఆగడు.. ఇలా చాలా సినిమాల్లో మూడు అక్షరాల టైటిల్స్ నే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా టైటిల్ మూడు అక్షరాలతో లేదు. అలాగే తన కొత్త చిత్రాల పూజా కార్యక్రమాల్లో ఆయనకు బదులు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్, కుటుంబ సభ్యులు హాజరవ్వడం ఆయన పెట్టుకున్న మరొక సెంటిమెంట్. అయితే రాజమౌళి ఒత్తిడి కారణంగా మహేష్ బాబు తన సెంటిమెంట్ పక్కన పెట్టి పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఎస్ఎస్ఎంబి 29 కోసం ఈ రెండు సెంటిమెంట్ లను మహేష్ బాబు బ్రేక్ చేశాడట.
ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి నమ్రతతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న SSMB29పై భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: