టీవీ: దర్శక ,నిర్మాతల కమిట్మెంట్..జబర్దస్త్ యాంకర్ ఓపెన్ కామెంట్స్..!

Divya
కామెడీ షోలలో అత్యంత ప్రజాదారణ పొందిన షో జబర్దస్త్.. ఈ ఎంతోమంది సామాన్యులను కూడా స్టార్స్ ని చేసింది. ముఖ్యంగా ఇందులో యాంకర్స్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ, అనసూయ కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ షోలోనే కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో అనసూయ బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి వెండి తెర మీద కనిపిస్తోంది. ఆ తర్వాత 2022లో అనసూయ మానేయడంతో రష్మీ నే జబర్దస్త్ ,ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి షోలకు యాంకర్ గా ఉండేది.. అలాంటి సమయంలోనే కన్నడ అమ్మాయి సౌమ్యరావుని యాంకర్ గా తీసుకురావడం జరిగింది మల్లెమాల సంస్థ.

అయితే ఆ తర్వాత ఈమె ఏడాదికే జబర్దస్త్ షో ని మానేయడం జరిగింది. ఆ తర్వాత బిగ్బాస్ ద్వారా పాపులర్ అయిన సిరి హనుమంతుని తీసుకొచ్చిన ఆమె కూడా వర్కౌట్ కాలేదు. అయితే కన్నడ నటి సౌమ్యారావు జబర్దస్త్ మానేయడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయంటూ కూడా గతంలో వెల్లడించింది.. ముఖ్యంగా తనకు తెలుగు సరిగ్గా రాదని అందువల్ల కొంతమందికి తన యాంకరింగ్ నచ్చుతుంది మరి కొంతమందికి నచ్చదని. తెలుగులో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నా కూడా ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకువచ్చారని విమర్శలు కూడా వినిపించాయి.

తనకి కామెడీ టైమింగ్ తెలియలేదని, డాన్స్ రాదని, యాంకరింగ్ అనుభవం లేదంటూ చాలామంది విమర్శించారంటూ తెలిపింది సౌమ్యరావు. పాత యాంకర్స్ లాగా ఎంటర్టైన్మెంట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశానని తెలిసింది. అయితే ఇప్పుడు తాజగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల పైన పలు విషయాలను తెలిపింది. కన్నడ సినీ పరిశ్రమ పైన మాట్లాడుతూ.. తనకు కన్నడ సినీ పరిశ్రమ మీద అభిమానం లేదని వారు టాలెంట్ ఉన్నవాళ్లను కూడా ఎంకరేజ్ చేయారని.. అందుకే కన్నడ సినీ పరిశ్రమ వెనక పడిపోయిందంటూ తెలిపింది. టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కావచ్చు ఉంది.. కానీ తనకు ఇక్కడ అలాంటి సంఘటనలు ఎదురు కాలేదని వెల్లడించింది. కన్నడలో మాత్రం తనని కొంతమంది లైంగిక వేధింపులకు గురి చేశారని.. దర్శక, నిర్మాతలు ఇలాంటివి చేస్తారని తెలిపింది. ప్రస్తుతం ఇమే చేసిన వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: