షాకింగ్ రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ధోని, కోహ్లీ కి కూడా సాధ్యం కాలేదు?
అంతేకాకుండా... శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ లో 2000 పరుగులు సాధించిన 7వ ఐపీఎల్ కెప్టెన్ ఘనత సాధించడం విశేషం. దాంతో ఈ ప్రత్యేక ఎలైట్ గ్రూప్ లో ఉన్న విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ ల సరసన చేరాడు. విషయం ఏమిటంటే, ఈ ఘటన వారికంటే కూడా చాలా ఫాస్ట్ గా సాధించాడని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో కోహ్లీ కెప్టెన్ గా 4994 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఉన్న ఎంఎస్ ధోని 4660 పరుగులు, 3986 పరుగులతో రోహిత్ శర్మ 3వ స్థానంలో, గంభీర్ 3518 పరుగులతో 4వ స్థానంలో, 5వ స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ 3356 పరుగులు, 6వ స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్ 2691 పరుగులు చేయగా ఐపీఎల్ చరిత్రలో 3 జట్లకు నాయకత్వం వహించిన 4వ క్రికెటర్ గా అయ్యర్ ఇపుడు రికార్డుల్లో నిలిచాడు.
ఇకపోతే మహేల జయవర్ధనే ఈ రికార్డును సృష్టించిన తొలి ప్లేయర్ గా అంతకుముందు వరకు ఉన్నాడు. ఆ తర్వాత కుమార్ సంగక్కర, స్టీవ్ స్మిత్ ఉన్నారు. విషయంలోకి వెళితే... అయ్యర్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి అద్భుతమైన ఆటను మ్యాచ్ చివరివరకు కొనసాగించడం విశేషం. మొత్తం 27 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే, ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోరు సాధించిన రెండో కెప్టెన్ గా నిలిచాడు.
కెప్టెన్సీ అరంగేట్రంలో ఒక ఫ్రాంచైజీకి అత్యధిక స్కోరు:
119 - సంజు శాంసన్ RR vs PBKS, వాంఖడే, 2021
99* - మయాంక్ అగర్వాల్ PBKS vs DC, అహ్మదాబాద్, 2021
97* - శ్రేయాస్ అయ్యర్ PBKS vs GT, అహ్మదాబాద్, 2025*
93* - శ్రేయాస్ అయ్యర్ DC vs KKR, ఢిల్లీ, 2018
88 - ఫాఫ్ డు ప్లెసిస్ RCB vs PBKS, ముంబై, 2022