ప్రియాంక చోప్రా పై పికల్లోతు కోపంగా ఉన్న జక్కన్న..అంత గబ్బు పని ఏం చేసిందంటే..?

Thota Jaya Madhuri
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో ఎవరూ టచ్ చేయని స్థాయిలో, హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ సినిమాను నిర్మించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతుండగా, ఇది కేవలం టాలీవుడ్‌కే కాదు, భారతీయ సినీ పరిశ్రమకే గర్వకారణంగా నిలవబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.



ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటి ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. చాలా కాలం తర్వాత ఆమె భారతీయ సినిమాలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ పెరిగింది. ఇదిలా ఉండగా, ఇటీవల ప్రియాంక చోప్రా ప్రముఖ కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆమె ఈ సినిమా గురించి ఇంతవరకు అధికారికంగా ప్రకటించని ఒక కీలక విషయాన్ని అనుకోకుండా బయటపెట్టారు.



అదేంటంటే, ‘వారణాసి’ చిత్రం సుమారు రూ. 1,300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది అని ప్రియాంక వెల్లడించారు. ఈ మాటలు వినిపించిన వెంటనే సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్‌గా మారింది. నిజానికి ఈ సినిమా బడ్జెట్‌పై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు నడుస్తున్న సమయంలో, హీరోయిన్ స్వయంగా ఈ స్థాయిలో ఓపెన్‌గా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రియాంక వ్యాఖ్యలపై రాజమౌళి ఫుల్ సీరియస్ అయ్యారని, సినిమా బడ్జెట్ వంటి కీలక విషయాలు అధికారిక ప్రకటనకు ముందు బయటకు రావడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

రూ. 1,300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా నిలవబోతోంది. అంతేకాదు, ఇది రాజమౌళి కెరీర్‌లోనే ఇప్పటివరకు వచ్చిన అత్యంత భారీ ప్రాజెక్ట్ కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న భారతీయ చిత్రాలలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం పార్ట్ 1’ చిత్రం ఉంది. ఆ చిత్రం రూ. 2,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.



కథ పరంగా చూస్తే, రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఒక గ్రాండ్ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో షూటింగ్ జరుపుకుంటూ, అత్యాధునిక వీ ఎఫ్ ఎక్స్, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కథకు అంతర్జాతీయ స్థాయిలో కనెక్ట్ అయ్యే అంశాలు ఉండటంతో, ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి. రాజమౌళి – కీరవాణి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ఇక కథను రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందిస్తుండగా, సంభాషణలను దర్శకుడు దేవా కట్టా రాస్తున్నారు. ఈ బలమైన క్రియేటివ్ టీమ్ కారణంగా సినిమాపై మరింత నమ్మకం ఏర్పడింది.



మొత్తంగా చూస్తే, ‘వారణాసి’ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా మారే అన్ని లక్షణాలు ఉన్నాయి. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, అద్భుతమైన టెక్నికల్ టీమ్, రాజమౌళి మార్క్ విజన్—అన్ని కలసి ఈ సినిమాను ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలబెట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: