స్టైల్ మార్చిన బాబు.. కేంద్ర పాలకులే సలాం కొడుతున్నారా.?

Pandrala Sravanthi
- అద్భుత పాలనతో ముందుకు..
- ఎన్డీఏ సర్కారులో  కింగ్ మేకర్..
- వయసు పెరిగినా తగ్గని పాలన స్పీడ్..

 
చంద్రబాబు నాయుడు..ఆయన ఏం మాట్లాడినా దాని వెనుక ఒక అర్థం  ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. టిడిపి కూటమి ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకొని, కేవలం ఏపీ రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగాడు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత  తన పాలనలో స్టైల్ మార్చారు. మరి ఆయనలో కలిగిన మార్పులు ఏంటి అనే వివరాలు చూద్దాం..
 పాలనలో స్టైల్:
 చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలకు  మొత్తం 164 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం ద్వారా గెలుపొందగలిగారు. ఐదు సంవత్సరాల జగన్ పాలన నుంచి ఆయన ఎన్నో నేర్చుకున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని, అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందని ఆయన ఎంతో బాధపడ్డారు. మళ్లీ రాష్ట్రం పుంజుకోవాలి తన పాలనలో స్టైల్ మార్చాలనుకున్నారు. ఆ విధంగానే ముందడుగు వేస్తున్నారు.  ఆయన 1995 సంవత్సరంలో 45 సంవత్సరాల వయసులో ఉన్నాడు.  ఆ టైంలో ఆయన  కనీసం 18 నుంచి 20 గంటలు పని చేసేవాడు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించగలిగాడు. అదే స్టైల్  తో 2024 ఎలక్షన్స్ లో కూడా దూసుకుపోతున్నాడు. వయసు పెరిగితే ఆయన పాలనలో కాస్త స్పీడు తగ్గుతుంది అని అనుకున్నారు.

కానీ ఆయన వయసు ఎలా పెరుగుతుందో, పాలనలో స్పీడ్ కూడా ఆ విధంగానే పెంచుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కానీ, ఇతర అభివృద్ధి పనులు కానీ శరవేగంగా జరగాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాడు. ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం వాలంటీర్ల మీదనే పాలన జరుగుతుందనే భావనను తీసిపడేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు దేశ రాజకీయాల్లో కూడా  కింగ్ మేకర్ అయ్యాడు. ఈయన వెళ్లి  కేంద్ర ప్రభుత్వాన్ని అది ఇది ఇవ్వండి అని కోరడం కాదు, వాళ్లే మీకేం కావాలో తీసుకోండి అనే విధంగా తయారయ్యాడని చెప్పవచ్చు. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేస్తున్నారని  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: