డిప్యూటీ సీఎం అయ్యాక పవన్‌లో ఈ మార్పులు చూసారా.. ప్రాణంలాంటి దాన్నే వదిలేసారే..??

Suma Kallamadi

• డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ లో చాలా మార్పులు  

• శ్వాస, ఊపిరి అన్నీ అయినా సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు  

• ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్  

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత చంద్రబాబు కేబినెట్ లో ఏపీ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ లో చాలా మార్పు కనిపిస్తోంది ఇంతకుముందు ఆవేశపడుతూ ప్రసంగాలు ఇచ్చేవారు. ఏం మాట్లాడినా కూడా పంచ్ డైలాగులు మాట్లాడేవారు కానీ ఇప్పుడు చాలా శాంతి కాముడిగా మారిపోయారు. ఎవరికైనా విమర్శలు చేయడం లేదు. గెలుపు సంతోషాన్ని కాదు పెద్ద బాధ్యతను ఇస్తుందని విజయం సాధించిన రోజే ఒక మంచి ప్రసంగం ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన చేస్తున్న పనులన్నీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

ఏపీ ప్రజల కోసం చాలా మంచి చేయాలనే తపన పవన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈమధ్య ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆయన డిప్యూటీ సీఎం సాలరీ ని కూడా తీసుకోలేదు అంతేకాదు అసెంబ్లీకి మూడు రోజులు హాజరైతే 35,000 ఇస్తామన్నారు కానీ అవి కూడా తీసుకోలేదు. ఫర్నిచర్ కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టొద్దని అధికారులకు ఆదేశించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు పవన్ ఒక పెద్ద అసెట్ అయిపోయారు. 

పవన్ ఈ గెలుపు తర్వాత తన జీవితాన్ని పూర్తిగా రాజకీయాలకి అంకితం చేసినట్లు అర్థమవుతుంది తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'నాకు మూవీలు చేసే టైమ్ ఉంటుందా. ? 3 నెలల తర్వాతే సినిమాలు చేయడానికి ఆలోచిస్తాను. అది కూడా రెండు, మూడు రోజులే షూటింగ్స్ లో పాల్గొంటా మళ్లీ ఏపీకి సేవలు చేస్తాను. మనం ఓజీ అంటే.. ప్రజలు క్యాజీ అంటారు. అధికారంలోకి వచ్చింది ఇప్పుడే చాలా పనులు ఉంటాయి కాబట్టి 3 నెలల పాటు షూటింగ్‌లో పాల్గొనలేను. ఫ్రీ టైమ్‌ దొరికినప్పుడు షూటింగ్‌కు తప్పనిసరిగా వస్తాను. ఇందుకు క్షమించాలని ప్రొడ్యూసర్లను కోరుకుంటున్నా. నా అందుబాటును దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్లు ఆ మేరకు సర్దుకుపోవాలి.' అని వ్యాఖ్యానించారు. నేను బట్టి ఆయన రాజకీయాలకు ఎంతగా వేల్యూ ఇస్తున్నారో సినిమాలను ఎలా పక్కన పెట్టేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: