ఏపీ: గడిచిన ఐదేళ్ల తర్వాత అలాంటి పని చేసిన సిఎం..!

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందుకున్నటువంటి మొట్టమొదటి తొలి పింఛన్ నిన్నటి రోజున ప్రారంభమైంది. అయితే తొలి నెలలోనే ఒక రోజులోనే 95% పైగా పింఛనేని పంపిణీ చేసినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే పింఛన్ పంపిణీలో నేరుగా పాల్గొన్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిలను సైతం సీఎం చంద్రబాబు అభినందించారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఒక్కరోజు స్థాయిలో పింఛన్ పంపిణీ చేయలేదంటూ తమ అభిప్రాయంగా వెల్లడించారు. సమర్థవంతమైన న్యాయకత్వం ఉంటేనే ఉద్యోగులు చాలా అద్భుతంగానే పనిచేస్తారంటూ తెలిపారు.

అయితే పింఛన్ల పంపిణీతో మరొకసారి ఈ విషయాన్ని రుజువు చేశారు చంద్రబాబు నాయుడు. గతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎక్కువగా వాలంటరీలను మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఈసారి ఏ ఒక్క వాలంటరీలను ఉపయోగించుకోకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించి వారి ద్వారానే పంపించారు దాదాపుగా ఈ పని ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులకు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పింఛన్ కార్యక్రమాన్ని సైతం మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ ని అందించారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో అధికారులతో సిబ్బందులతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొని పింఛన్ల పండుగని చాలా ఘనంగా నిర్వహించి సక్సెస్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజవర్గంలో పర్యటించారు. దాదాపుగా 95% పించిని పంపిణీ కార్యక్రమం పైన పూర్తి చేసినట్లు రాష్ట్ర సమాచారం పౌర సంబంధాలు మంత్రి కొలువు పార్థసారథి ఈ విషయాన్ని తెలియజేశారు. దాదాపుగా రాష్ట్రంలో ఉండే 61.76 లక్షల మందికి ఎన్నడు లేనివిధంగా కేవలం ఒక్కరోజులోనే 4,170 కోట్ల పంపిణీ చేశామంటూ వెల్లడించారు.1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పనిని పూర్తి చేశామంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: