బాబు అంటే ఇదేరా: తలెత్తుకుని తిరుగుతున్న తెలుగు తమ్ముళ్లు ?

Veldandi Saikiran

* చంద్రబాబు మార్క్ పాలన
* ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత, ఫుల్ పవర్స్
* ప్రజల వద్దకే పాలన
* వాలంటీర్ల ప్రాధాన్యత తగ్గింపు
* జగన్ పాలనను తలదన్నేలా రూలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్కు పాలనను స్పష్టంగా చూపిస్తున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు... తన అనుభవాన్ని మొత్తం... ఇప్పుడు బయటకు తీస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త నుంచి బడా లీడర్ వరకు అందరికీ న్యాయం చేసేలా ఆ ముందుకు వెళ్తున్నారు.
 ఎమ్మెల్యే కానీ  సర్పంచి కానీ ఇలా అందరికీ ప్రజల్లో సముచితస్థానం...కలిగేలా.. చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో.... ఫుల్ పవర్స్ వాలంటీర్లకు మాత్రమే ఉండేటివి. ఏ అవసరం కావాలన్నా... ఓ ప్రైవేట్ సైన్యంలో వాలంటీర్లు పనిచేశారు. దానివల్ల... ప్రజా ప్రతినిధులకు అసలు వ్యాల్యూ లేకుండా పోయింది. ప్రతిపక్ష నాయకుడు కూడా.... వాలంటీర్ దగ్గరికి వెళ్లి పని చేయించుకునే వారు. దానివల్ల అధికార వైసీపీ పార్టీ ప్రజా ప్రతినిధుల  ప్రాధాన్యత తగ్గిపోయింది.
 ఫలితంగా మంత్రులు కూడా దాదాపు అందరూ ఓడిపోయారు. డమ్మీ అయిపోయారు. అయితే... ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అలా... కాకుండా... టిడిపి కానీ లేదా జనసేన అటు బిజెపి  ఎమ్మెల్యేలు  స్వయంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ల అవసరాన్ని తగ్గించేశారు. ప్రతి ఒక్క చోట ప్రతి నియోజకవర్గంలో... ఫైనల్ బాస్ ఒక ఎమ్మెల్యే నే. అనే స్థాయికి మళ్లీ చంద్రబాబు తీసుకువచ్చారు.
 తెలుగు తమ్ముళ్లు తలెత్తుకునేలా... ఏపీలో పరిస్థితిని చక్కదిద్దారు చంద్రబాబు. ఇక ఏ అవసరం కావాలన్నా... స్థానిక ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. అటు జనసేన అలాగే బిజెపి నాయకులకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్త పడుతున్నారు. గడిచిన నెల రోజుల్లో... ఈ మార్పులు స్పష్టంగా కనిపించాయి. ఇలాగే ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు పాలిస్తే... ఏపీ గాడిలో పడుతుందని ఈ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: