టీవీ: వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని నూకరాజుకు షాక్ ఇచ్చిన ప్రియురాలు..!

Divya
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి కంటే బుల్లితెర పైన నటీనటులు ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మరింత క్రేజీ సంపాదించుకున్న కమెడియన్లలో నూకరాజు కూడా ఒకరు.. ప్రస్తుతం టీమ్ లీడర్ గా ఉన్నటువంటి ఈ కమెడియన్ జబర్దస్త్ షో లోనే కాకుండా ఇతర షోలలో కూడ ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా నూకరాజు, ఆసియా అనే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారనే విషయం చాలా మందికి తెలిసిందే.. వీరిద్దరూ ఎన్నో షోలలో స్కిట్లు చేయడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ను పెట్టి మరి పలు రకాల వాటిని చేస్తూ ఉంటారు.

అలాగే ఆసియా, నూకరాజు ఇద్దరు కూడా ఎన్నో రకాల అషోలకు హాజరవుతూ ఉంటారు. కానీ పెళ్లి మాత్రం తమ పెద్దలకు ఇష్టం లేకపోవడంతో చేసుకోలేదని గతంలో ఒక షోలో భాగంగా తెలియజేశారు. అయినప్పటికీ విడిపోకుండా పెద్దవారి అనుమతి కోసమే ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.. అయితే తాజాగా ఆసియా నూకరాజుకు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. వేరే అబ్బాయిని వివాహం చేసుకున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

అయితే అది నిజం పెళ్లి కాదు ఏదో వీడియో కోసం స్క్రిప్ట్ లో భాగంగా చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పెళ్లి దుస్తులు ధరించి ఆసియా కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు..ఈ వీడియోలో విషయానికి వస్తే పడవలో వెళుతూ ఉండగా.. ఒకరు నూకరాజు అన్న ఆసియా అక్క వేరే అబ్బాయిని  పెళ్లి చేసుకోబోతోంది వచ్చి ఆశీర్వదించు అంటూ అరవడం వినవచ్చు.. దీంతో ఆ మాటలు విన్న నూకరాజు సైతం ఒక్కసారిగా షాకి గురవుతూ ఉన్నట్లుగా చూపించారు. అయితే ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు సైతం స్మైల్ ఎమోజీలను కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో మాత్రం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: