ఏపీ: వాలంటరీల అవసరం లేకుండా చేస్తున్న ఏపీ సీఎం..!

Divya
ఒకటో తారీకు వచ్చిందంటే చాలు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు ఇంటి వద్దకే వాలంటరీలు తీసుకువచ్చేవారు.. ఇలా ప్రతినెల వైసిపి ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు పింఛన్ ఇంటి వద్దకే వచ్చేది.. అయితే ఇప్పుడు తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీలను ఇన్వాల్వ్ చేయవద్దంటూ కరాకండిగా చెప్పేసినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు అంటూ గత ప్రభుత్వం వాలంటరీలకు పట్టం కట్టిన ఈసారి పింఛన్ అందించే వ్యవహారానికి కొత్త ప్రభుత్వం వాలంటరీలకు స్వస్తి చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వాలంటరీల వీధుల్లో కీలకమైన పింఛన్ల పంపిణీకి దూరం పెట్టడం ద్వారా ఏపీ సర్కార్ అందుకు తగ్గ సంకేతాలే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వైసిపి పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఎక్కువగా వాలంటరీల మీద వినిపించడంతో ఈసారి చంద్రబాబు వీరి పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ఎవరితో ఎలాంటి పని లేకుండా కేవలం వాలంటరీల ద్వారానే ప్రజలకు అన్ని అవసరాలను తీర్చేలా చేశారు. అయితే వీరికి గౌరవ వేతనం కింద 5000 రూపాయలు అలవెన్స్ కింద మరో రెండు వందల రూపాయలను కూడా చెల్లించేది.

ఐదేళ్లపాటు గ్రామాలలో అన్ని తామై చూసుకున్న వాలంటరీలు ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నారని ఎలక్షన్స్ ముందు వీరందరిని ఆపివేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలో 1,50,000 మంది వాలంటరీలు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. అయితే కొన్ని కారణాల చేత 1,8,000 మంది రాజీనామా చేశారు.. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వీరికి పదివేల రూపాయలు చేస్తానని చెప్పినప్పటికీ.. కొత్త ప్రభుత్వం ఇంకా సరైన నిర్ణయాన్ని తీసుకోలేదు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గమనిస్తే వాలంటరీ వ్యవస్థ లేకుండానే అన్ని పనులు చేయించేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పక్క ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారు. మరి వాలంటరీలను తొలగిస్తారా లేదా అనే విషయం మరో కొద్ది రోజులలో తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: