కల్కి 2898AD: అలా చేయకండి అంటూ వేడుకుంటున్న నిర్మాతలు..!

Divya
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898Ad సినిమా విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట మంచి రెస్పాన్స్ కూడా లభించింది.. అటు మాస్ క్లాస్ ఆడియన్స్నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కల్కి చిత్రం బాగా ఆకట్టుకుంది. దాదాపుగా 700 కోట్ల రూపాయలతో కల్కి చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కల్కి సినిమా విడుదలయ్యాక డైరెక్టర్ నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ఒక రిక్వెస్ట్ ని సైతం తెలియజేశారు.

అదేమిటంటే కల్కి సినిమా కోసం నాలుగేళ్లు సుదీర్ఘ ప్రయాణం చేశాము నాగ్ అశ్విన్ అతని బృందం సమస్త కృషి ఫలితమే ఈ చిత్రము అంటూ తెలిపారు. హాలీవుడ్ ను తలపించేలా ఉన్న ఈ కల్కి సినిమా తీయడానికి మా నుంచి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసాము క్వాలిటీలో  మా టీం కూడా ఎక్కడ రాజీ పడలేదు.. మా టీమ్  చెమటోర్చి.రక్తం ఒడిచి ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చాము.. వారు పెట్టిన శ్రమను గౌరవిద్దాం థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు దయచేసి మొబైల్ ఫోన్లో కెమెరాలలో ఎలాంటి సన్నివేశాలను తీయకండి.. మీరు ఇలా చేసి పైరసీలకు అవకాశం ఇవ్వద్దండి అంటూ తెలిపారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మాతలు ఇందుకు సంబంధించి ట్విట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇండియాలో అత్యధికంగా భారీ బడ్జెట్ తెలకెక్కించిన చిత్రాలలో కల్కి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కోసం వైజయంతి మూవీస్ వారు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో ప్రభాస్ హీరోగా నటించగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ,అమితాబచ్చన్, కమలహాసన్, దిశాపటాని, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ,రాంగోపాల్ వర్మ, రాజమౌళి తదితరులు సైతం నటించడం జరిగింది. ఈ సినిమా సీక్వెల్ పై కూడా చిత్ర బృందం మరో పది రోజులలోపే అదిరిపోయే అప్డేట్ ఇస్తామంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: