ల్కి 2898 AD: థియేటర్లు హౌస్ ఫుల్.. కళకళలాడుతున్న బాక్స్ ఆఫీస్?

Purushottham Vinay
 
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898AD సినిమా గ్రాండ్ గా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమాగా దీన్ని తెరపైకి తీసుకు రావడం జరిగింది.మొదటి షో నుంచే థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే విడుదలకు ముందు ఇది మామూలుగానే ఉన్నా విడుదల తరువాత చాలా పెద్ద సినిమా అని ముందుగానే అశ్వినిదత్ ముందే హింట్ ఇచ్చారు.ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఏ, బీ ఇంకా సీ సెంటర్లలో థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. కళకళలాడుతున్న థియేటర్లలో ఈ సినిమా విడుదలవడంతో ఫ్యాన్స్ ఎంతో హుషారుగా ఉన్నారు. చాలా రోజుల తరువాత అన్ని లాంగ్వేజెస్ కు సంబంధించిన బాక్సాఫీస్ ల వద్ద ఒక పండగ వాతావరణం అనేది నెలకొంది.


 కల్కి సినిమాకు ఫస్ట్ షోల నుంచే అదిరిపోయే బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. అద్భుతమైన మైథాలజీ స్కై ఫై కథా నేపథ్యంతో ప్రేక్షకులను మెప్పిస్తున్న కల్కి, రికార్డ్ స్థాయి టికెట్ అమ్మకాలని కూడా సాధించింది. ఎర్లీ మార్నింగ్ షోలు నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం ఇంకా సినిమా రన్‌ని మరింత గ్రాండ్‌గా మార్చింది. ఈ మూవీకి అందరూ పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. కల్కి 2898 ఏడి సినిమాను నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకులు స్పందిస్తూ ఎన్నో ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సులు, ప్రభాస్ నటన ఇంకా అద్భుతమైన విజువల్స్ కల్కి సినిమాను ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభవంగా మలిచాయి. ఇంకా వారం రోజుల పాటు ఈ ఊపు కొనసాగితే 1000 కోట్లు రాబట్టాడం పక్కా అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: