జ‌గ‌న్‌కు షాక్‌... టీడీపీ ఖాతాలోకి పులివెందుల‌..?

RAMAKRISHNA S.S.
ఈ టైటిల్ చూడ‌డానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అదేంటి జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయ‌నా త‌న కంచుకోట‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన పులివెందుల లో మాత్రం తాను ఎమ్మెల్యే గా గెలిచారు. మ‌రి అలాంటిది ఇప్పుడు టీడీపీ ఖాతాలోకి పులివెందుల రావ‌డం ఏంట‌నుకుంటున్నారా ? అదే బిగ్ ట్విస్ట్‌. జ‌గ‌న్ పులివెందుల ఎమ్మెల్యే గా గెలిచినా కూడా 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజార్టీతో పోలిస్తే ఈ ఎన్నిక‌ల్లో మెజార్టీ ఏకంగా 33 వేల‌కు పైగా త‌గ్గిపోయింది. 2019లో 92 వేలు వ‌స్తే.. ఇప్పుడు కేవ‌లం 58 వేలు మాత్ర‌మే వ‌చ్చింది.

ఇక జ‌గ‌న్ ఘోరంగా ఓడిపోయాక ఐదు రోజుల పాటు పులివెందుల టూర్ పెట్టుకున్నారు. అయితే అక్క‌డ సొంత పార్టీ నేత‌ల నుంచే నిల‌దీత‌లు... ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా రావ‌డంతో జ‌గ‌న్ ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. దీంతో రెండు రోజుల్లోనే అక్క‌డ నుంచి బెంగ‌ళూరుకు మ‌కాం మార్చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పులివెందుల మున్సిపాల్టీకి చెందిన ప‌లువురు కౌన్సెల‌ర్లు వైసీపీని వీడి టీడీపీలోకి వ‌చ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌. ఇదే జ‌రిగితే పులివెందులలో జగన్ రెడ్డికి భారీ షాక్ తగిలిన‌ట్టే.

ప‌ట్ట‌ణంలో చాలా మంది వైసీపీ కౌన్సెల‌ర్లు పెద్ద ఎత్తున పనులు చేయించి వాటికి బిల్లులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇటీవ‌ల జ‌గ‌న్ పులివెంద‌ల వెళ్లిన‌ప్పుడు జ‌గ‌న్‌, భార‌తి ఇద్ద‌రిని క‌లిసిన కౌన్సెల‌ర్లు త‌మ‌కు బిల్లులు ఇప్పించకపోతే అప్పుల పాలైపోతామని ఆస్తులు అమ్మినా తీరవని గోడు వెళ్ల బోసుకున్నారు. ఈ అప్పులు తీర‌క‌పోతే .. తాము క‌నీసం వడ్డీలు కట్టుకోలేమని.. త‌మ‌కు జ‌గ‌న్ క‌నీసం భరోసా కూడా ఇవ్వకపోవడంతో పార్టీలో ఎలా ఉంటామ‌న్న  ప్ర‌శ్న‌లు వారు వేస్తున్నారు.

ఇదే టైంలో పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ ర‌వి కి వైసీపీ కౌన్సెల‌ర్ల‌లో చాలా మంది త‌మ‌కు బిల్లులు ఇప్పిస్తే చాలు టీడీపీలోకి వస్తామని సమాచారం పంపుతున్నార‌ట‌. ఎక్కువ మంది కౌన్సెల‌ర్ల‌ను టీడీపీలోకి లాగేసి పులివెందుల మున్సిపాల్టీ టీడీపీ ఖాతాలోకి వేసేందుకు బీటెక్ ర‌వి ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: