జగన్‌ కు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ కేసీఆర్‌ కు ఇవ్వనున్న కాంగ్రెస్‌..?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్ర ప్రదేశ్‌ తరహా పాలిటిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి పక్ష నేతలు, పార్టీలపై కక్ష్య రాజకీయాలు, కుట్రలు, కుతంత్రలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌ సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసినట్లుగానే... తెలంగాణ రాష్ట్రం లో గులాబీ పార్టీ ఆఫీసులను కూల్చేందుకు కాంగ్రెస్‌ స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది.

తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చువేతకు సంచలన ఆదేశాలు ఇచ్చారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోమవారం నల్గండలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం నడిబొడ్డున.. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మించారని ఆగ్రహించారు. ఏకంగా రూ. 100 కోట్లు విలువైన ప్రభుత్వ స్థలంలో.. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారు..? అని ఆగ్రహించారు  కోమటిరెడ్డి వెంకట రెడ్డి.

అందుకే రూల్స్‌ ప్రకారం... నల్గొండ BRS పార్టీ ఆఫీస్ తక్షణమే కూల్చేయాలనీ.. మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవాలక్ష రూల్స్ పెడుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. 100 కోట్ల భూమిలో అనుమతి లేకుండా ఇంద్ర భవనం లాంటి పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతుల్లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికు సూచనలు కూడా చేశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇకపై ఇలాంటి నిర్మాణాలు ఎవరూ చేపట్టినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే... తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు...చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌ లో తెలంగాణ కాంగ్రెస్‌ సర్కార్‌ నడుస్తోందని నిప్పులు చెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: