కల్కి 2899 AD : ఇదెక్కడి మాస్ రాంపేజ్.. సాంగ్ తో కూడా సెన్సేషన్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ జూన్ 27 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా నుండి కొన్ని పాటలను మూవీ బృందం విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో "త తక్కర" అంటూ సాగే ఒక పాట కూడా ఉంది. కాకపోతే దీనిని మూవీ బృందం సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేయలేదు. దానితో ఈ సినిమాలో ఎలాంటి సాంగ్ ఉంది అని కూడా ఎవరికి తెలియదు. ఇక సడన్ గా ఈ మూవీ లో ఈ సాంగ్ ఉండే సరికి జనాలు ఆశ్చర్యపోయారు.

ఇక నేరుగా థియేటర్లలో విన్నా కూడా ఈ సినిమాలోని ఈ పాట ఒక్క సరికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. దానితో ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ థియేటర్లలో జనాల నుండి వచ్చింది. ఈ సాంగ్ను ప్రభాస్ మరియు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన దిశ పటని పై చిత్రకరించారు. ఈ మూవీలో ప్రభాస్ ఎప్పుడు కాంప్లెక్స్ లోకి వెళ్లాలి అని అంటూ ఉంటాడు. ఇక దిశా పటానికి కాంప్లెక్స్ లో ఉద్యోగం రావడంతో నేను కూడా కాంప్లెక్స్ లోకి వస్తాను అని ప్రభాస్ , దిశా పటానిని బతిమాలాగా ఆమె ఒప్పుకుంటుంది.

కేవలం ఒక గంట మాత్రమే కాంప్లెక్స్ లో ఉండే విధంగా ప్రభాస్ ను దిశా పటాన్ని తీసుకొని వెళుతుంది. అక్కడ ఈ పాట ఉంటుంది. ఇక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సినిమాలోని ఈ వీడియో సాంగ్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ యొక్క తెలుగు వర్షన్ కు యూట్యూబ్ లో 4.1 మిలియన్ వ్యూస్ ... 136 కే లైక్స్  దక్కాయి. ఈ సాంగ్ విడుదల అయ్యి ఇప్పటికి 20 గంటలు మాత్రమే అవుతుంది. ఇంతలోనే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. అంటే మరి రాబోయే రోజుల్లో ఈ సాంగ్ మరింత ఫేమస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: